GabbarSingh4k : ప్రీ రిలీజ్ బుకింగ్స్ తోనే గబ్బర్ సింగ్ సంచలనం..

GabbarSingh4k : టాలీవుడ్ లో కొన్నాళ్లుగా రీ రిలీజ్ ప్రభావం తగ్గిపోయేసరికి, రీ రిలీజ్ లపై జనాలకు ఆసక్తి తగ్గిపోయిందని చాలా మంది అనుకున్నారు. కానీ రీసెంట్ గా మురారి (Murari) సినిమాతో మళ్ళీ రీ రిలీజ్ ల హంగామా ఓ రేంజ్ లో మొదలైంది. ఆ సినిమా రీ రిలీజ్ సినిమాల్లో ఏకంగా హైయెస్ట్ గ్రాసర్ గా నిలవడం విశేషం. ఇక దాని తర్వాత వెంటనే మెగాస్టార్ చిరంజీవి నటించిన “ఇంద్ర” (Indra) సినిమా రీ రిలీజ్ అయింది. ఈ సినిమా రీ రిలీజ్ చేయాలనీ చిరు ఫ్యాన్స్ ఎప్పట్నుంచో కోరుకుంటుండగా, ఎట్టకేలకు చిరు బర్త్ డే స్పెషల్ గా ఆగష్టు 22న థియేటర్లలో రీ రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సినిమా కూడా అద్భుతమైన రెస్పాన్స్ తో థియేటర్లలో భారీ వసూళ్లు సాధించింది. 3.44 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసి, సీనియర్ స్టార్ హీరోల పరంగా అదిరిపోయే కలెక్షన్లు వసూలు చేసింది. ఇక ఇప్పుడు మళ్ళీ పవర్ స్టార్ వంతు వచ్చింది.

Gabbar Singh4k has crossed 1crore mark in pre-release advance bookings

ప్రీ రిలీజ్ బుకింగ్స్ లో గబ్బర్ సింగ్ సంచలనం…

అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) బర్త్ డే స్పెషల్ గా బ్లాక్ బస్టర్ సినిమా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ (GabbarSingh4k) సెప్టెంబర్ 2న అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఇప్పట్నుంచే ప్రీ రిలీజ్ బుకింగ్స్ లో ఓ రేంజ్ లో వసూలు చేస్తుంది. ఆన్లైన్ బుకింగ్స్ పరంగా ఓవర్సీస్ సహా అన్ని చోట్ల అదిరిపోయే బుకింగ్స్ తో రచ్చ చేస్తున్న గబ్బర్ సింగ్ కొత్త రికార్డులు క్రియేట్ చేసేలానే ఉంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ లో 1 కోటి రూపాయల మార్క్ ని క్రాస్ చేసేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో ఇప్పటికే కొన్ని థియేటర్లలో ఆల్మోస్ట్ హౌస్ ఫుల్ షో బుకింగ్ అయిపోయాయి. ఆఫ్ లైన్ టికెట్ లెక్కలు బాగుంటే తొలిరోజు రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది.

- Advertisement -

గబ్బర్ సింగ్ అన్ని లెక్కలు తెలుస్తాడా?

ఇక రీసెంట్ గా చిరంజీవి (Chiranjeevi) ఇంద్ర సినిమాతో ఓవర్సీస్ లో అల్ టైం ఓపెనింగ్స్ సాధించాడు. ఆ సినిమా ఓవర్సీస్ లో 64k మిలియన్ డాలర్ల మార్క్ దాటేసింది. అలాగే బెంగుళూర్ లో కూడా ఇంద్ర అల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ సాధించి 33 లక్షల ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఇక ఓవరాల్ గా ఫస్ట్ డే మురారి సినిమా అల్ టైం ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తో అన్ని లెక్కలు సెట్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఓవర్సీస్ లో కూడా ఇప్పటికే 20k క్రాస్ చేసిన ఈ సినిమా రిలీజ్ టైం నాటికి క్రేజీ ఓపెనింగ్స్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. మరి గబ్బర్ సింగ్ సెప్టెంబర్ 2న రీ రిలీజ్ లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు