Game Changer: ఇంకెంతకాలం షూటింగ్ చేస్తావు శంకర్

Game Changer: రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఆచార్య సినిమాలో కనిపించాడు. కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన ఘనవిజయాన్ని సాధించలేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమా భారీ డిజాస్టర్ అయింది. అప్పటివరకు కొరటాల శివ మీద ఉన్న నమ్మకాలు అన్నీ కూడా పటాపంచలు అయిపోయాయి. సినిమా మినిమం యావరేజ్ అయిన అవుతుందని చాలామంది నమ్మారు. కానీ ఎవరు ఊహించని విధంగా ఆ సినిమా నేలమట్టం అయిపోయింది.

చరణ్ కు మాత్రమే దక్కిన అవకాశం

ఇకపోతే దర్శకుడు శంకర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అంతా పాన్ ఇండియా సినిమా హవా నడుస్తున్న టైం ఇది. అయితే ఒకప్పుడు శంకర్ దర్శకత్వం వహించే సినిమాలు పాన్ ఇండియా కాన్సెప్ట్ లా అనిపించేది. ఏదైనా ఒక సినిమాను చేస్తున్నాడు అంటే అది కచ్చితంగా కొత్త కాన్సెప్ట్ ని చాలామంది నమ్మకంతో సినిమాలుకు వెళ్లేవారు. శంకర్ సినిమా అంటే అంచనాలు ఒక రేంజ్ లో ఉండేవి. కమర్షియల్ గా సినిమాని హిట్ చేయడమే కాకుండా సొసైటీ కూడా ఏదో ఒక మెసేజ్ ఇవ్వటం శంకర్ సినిమాల్లో మనం చూస్తూనే ఉంటాం. శంకర్ కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలో ఉన్నాయి. అయితే శంకర్ తో సినిమా చేయాలని మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక సందర్భంలో అనుకున్నారు కానీ అది కుదరలేదు. కానీ అవకాశం రాంచరణ్ తేజ్ కు దక్కింది.

భారతీయుడు రిలీజ్ కి సిద్ధం

ఇకపోతే కార్తీక్ సుబ్బరాజు అందించిన కథతో శంకర్ దర్శకత్వం మొదలుపెట్టారు. ఈ సినిమాకి గేమ్ చేయించారనే టైటిల్ ఖరారు చేశారు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. ఒక సంక్రాంతికి రిలీజ్ అని కూడా వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో సరైన క్లారిటీ ఒకటి కూడా లేదు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఫాన్స్ పడిగాపులు కాస్తున్నారు. ఎందుకంటే రామ్ చరణ్ ని స్క్రీన్ మీద చూసి చాలా రోజులైంది. ఈ సినిమాతో పాటుగా భారతీయుడు అనే సినిమాను కూడా శంకర్ దర్శకత్వం వహించాడు. ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

- Advertisement -

Ram Charan

గేమ్ చేంజర్ ఇంకా పెండింగ్

ఇకపోతే గేమ్ చేంజెస్ సినిమా షూటింగ్ ఇంకో 30 రోజుల వరకు పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో వస్తున్నట్లు వార్తలు కూడా వినిపించాయి. చరణ్ పుట్టినరోజు కానుక ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు. ఆ సింగిల్ కూడా చాలామందిని ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి 30 రోజులు షూటింగు ఉండగా దానిలో దాదాపు పది రోజులు రాంచరణ్ షూటింగ్ పెండింగ్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇది పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కి తీసుకునే టైం బట్టి ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు