GameChanger : చరణ్ ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తున్న శంకర్.. ఇంకా షూటింగేంటయ్యా?

GameChanger : టాలీవుడ్ లో మూవీ లవర్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది “గేమ్ ఛేంజర్” అనే చెప్పాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ షణ్ముగం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ మెంట్ అయి కూడా నాలుగేళ్ల పైనే అయింది. మొదలుపెట్టి కూడా మూడేళ్లు దాటింది. అయినా ఇప్పటికి షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. మొన్నటిదాకా షూటింగ్ మొత్తం ఫినిష్ అయింది. చరణ్ షూటింగ్ ఏమి లేదు. చిన్న చిన్న ఆర్టిస్ట్ లతో పది రోజుల షూటింగ్ మాత్రమే ఉందని రెండు నెలలుగా ఈ మాట చెప్తున్నారు. ఇప్పటికీ ఆ చిన్న చిన్న షెడ్యూల్స్ నాలుగైదు దాటిపోయాయి. అయినా సరే ఇంకా షూటింగ్ పూర్తి కాలేదని సమాచారం.

Game Changer latest shooting update

గేమ్ ఛేంజర్ మరో షెడ్యూల్ ఇక్కడే..

ఇక తాజా సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ (GameChanger ) ఫైనల్ షెడ్యూల్ అంటూ అప్డేట్ వచ్చింది. గేమ్ ఛేంజర్ షూటింగ్ ని రేపు, ఎల్లుండి అనగా (ఆగష్టు 31, సెప్టెంబర్ 1న) సిరిసిల్ల లో షూటింగ్ చేస్తున్నారంటూ చిత్ర యూనిట్ నుండి సమాచారం వచ్చింది. అక్కడ చిత్రంలో కీలక పాత్రధారులైన ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర ఇంకా కొందరు కీలక పాత్ర ధారులపై పలు కీలక సన్నివేశాలు షూట్ చేయబోతున్నారని సమాచారం. అయితే ఈ వార్త విన్న ఫ్యాన్స్ మాత్రం నెట్టింట ఇటు శంకర్ పై, అటు దిల్ రాజు పై ఫైర్ అవుతున్నారు.

- Advertisement -

ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తున్న దిల్ రాజు, శంకర్..

అయితే అప్పుడెప్పుడో దిల్ రాజు (Dil raju) సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని, పది రోజుల షెడ్యూల్ మాత్రమే ఉందని అన్నాడు. అలా అని రెండు నెలలుకాగా, నెలన్నర గా క్రిస్మస్ కి తీసుకొస్తామని అంటున్నాడు. కానీ శంకర్ మాత్రం సినిమాని ఇంకా చెక్కుతునే ఉన్నాడు. నెలల తరబడి గేమ్ చేంజర్ వాయిదాల పర్వం కంటిన్యూ అవుతూ ఉంది. కర్ణుడి చావుకు సవాలక్షా కారణాలన్నట్టు ఈ సినిమా వాయిదాపడడానికి కారణాలు చాలానే ఉన్నా, వాటన్నిటికీ బాధ్యుడు మాత్రం శంకరే. సింపుల్ గా చెప్పాలంటే చరణ్ (Ram charan) ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తున్నారని చెప్పాలి. ఏది ఏమైనా ఇప్పుడు ఇండియన్2 కహాని పూర్తయింది కాబట్టి, ఇప్పుడు గేమ్ ఛేంజర్ పైనే ఫుల్ ఫోకస్ పెడతాడనడంలో సందేహం లేదు. కానీ ప్రమోషన్లు ఇప్పుడైనా మొదలుపెట్టకపోతే ఎలా అని చరణ్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వినాయకచవితికి గేమ్ ఛేంజర్ అప్డేట్ ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఎలాంటి అప్డేట్ ఇస్తారో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు