Game Changer : చరణ్ పై కాకుండా అన్ని రోజుల షూటింగ్ బాకీ? ఇలా అయితే ఎలా?

Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ రాజమండ్రి లో జరుగుతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తో పాటు సునీల్, నవీన్ చంద్ర వంటి కీలక పాత్రదారులు ఆ షూటింగ్ లో పాల్గొన్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కోసం చరణ్ అభిమానులు రెండేళ్లుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక గేమ్ ఛేంజర్ షూటింగ్ కూడా చివరి దశలో ఉందన్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం తెలిసినా చరణ్ అభిమానులు మాత్రం సంతృప్తిగా లేరు. ఎందుకంటే ఇండియన్2 రిలీజ్ అయితే గాని గేమ్ ఛేంజర్ విడుదల కాదు. ఇంకా చెప్పాలంటే ఆ సినిమా రిలీజ్ అయ్యాకే గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ని ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక శంకర్ మాత్రం రెండు పడవలపై ప్రయాణిస్తూ, అటు ఇండియన్2 సినిమా ప్రమోషన్లు చేస్తూనే ఇటు గేమ్ ఛేంజర్ ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. పైగా కల్కి2898AD రిలీజ్ అయ్యాక ఆ సినిమా టాక్ ని బట్టి ఇండియన్ 2ని మరింత ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే రెండు పాన్ ఇండియా సినిమాలకు కనీసం మూడు వారాలైనా గ్యాప్ ఉండక తప్పని పరిస్థితి. ఇదిలా ఉండగా గేమ్ ఛేంజర్ ఫైనల్ షెడ్యూల్ పై ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ తెలిసింది.

Game Changer movie shooting latest update

చరణ్ పై కాకుండా ఇంకా అన్ని రోజుల షూట్ బాకీ?

ఇక గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా కి సంబంధించి రామ్ చరణ్ తన ఫైనల్ పోర్షన్ ని పూర్తి చేసుకునే దగ్గరకి వచ్చేసాడు. ఇక ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ ఇంట్రో సీన్ ని షూట్ చేస్తున్నారని సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో ఫైనల్ షెడ్యూల్ పూర్తి కానున్న ఈ సినిమా విషయంలో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ పాత్రకు సంబంధించి ఒక్క రోజు మినహా మిగిలిన షూట్ అంతా పూర్తయిందట. ఇక ప్రముఖ నటుడు సముద్రఖని కాంబినేషన్ లో ఆ ఒక్క రోజుకి సంబంధించి షూట్ పూర్తి చేయాల్సిన అవసరం ఉందట. అయితే ఈ సినిమాలో చరణ్ పై కాకుండా, ఇంకా మిగిలిన పాత్రలకి సంబంధించిన షూట్ దాదాపు 10 రోజుల వరకు బాకీ వుందని సమాచారం. ఇది ఎంతవరకు నిజమో తెలీదు గాని ఈ వార్త చరణ్ అభిమానులని కంగారు పెడుతుంది.

- Advertisement -

రిలీజ్ పై పక్కా అప్డేట్ ఎప్పుడు?

ఇక గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ డేట్ పై మాత్రం ఇంత వరకు క్లారిటీ లేదు. సినిమా సమ్మర్ నుండి వాయిదాల పర్వం కంటిన్యూ చేస్తుండగా, దసరా కి రిలీజ్ అవుతుందని కూడా పక్కాగా చెప్పడం లేదు. పోనీ దీపావళికి చేయాలని వున్నా, వీలు కావడం కష్టమని దిల్ రాజు భావిస్తున్నాడట. లేటెస్ట్ గా వస్తున్న కొన్ని వార్తల ప్రకారం క్రిస్మస్ కు గేమ్ ఛేంజర్ ని విడుదల చేయాలని డిస్కషన్లు జరుగుతున్నాయట. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు కియారా అద్వానీ సహా మరికొందరు ఐపీఎస్ ఆఫీసర్లు గా కనిపించబోతున్నారు. నవీన్ చంద్ర, సునీల్, ఎస్.జె. సూర్య వంటి నటీనటుల పాత్రలు రామ్ నందన్ ఐపీఎస్ తో కీలకంగా ఉంటాయని సమాచారం. అలాగే శ్రీకాంత్, రాజీవ్ కనకాల వంటి నటులు ఫ్లాష్ బ్యాక్ లో అప్పన్న తో జర్నీ చేస్తారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర బ్యానర్ లో దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా నెక్స్ట్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు