Game Changer : మొన్న నిర్మాత, నిన్న మ్యూజిక్ డైరెక్టర్ , నేడు లిరిసిస్ట్ అన్ని అప్డేట్సే

Game Changer : ప్రస్తుతం ఇండియన్ ఆడియన్స్ అంతా కూడా ఇండియన్ డైరెక్టర్ శంకర్ తీస్తున్న గేమ్ చేంజర్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. దీని కారణం రామ్ చరణ్ తేజ్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం శంకర్ వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్నాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఇండియన్ 2 సినిమా ఊహించిన విజయాన్ని సాధించలేదు. ఇకపోతే అందరికీ గేమ్ చేంజర్ సినిమా పైన నమ్మకాలు ఉన్నాయి. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో అందరూ చాలా క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా దాదాపు 3 ఏళ్ల క్రితం మొదలైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమా 50వ సినిమాగా వస్తుంది అని అనౌన్స్ చేశారు. కానీ ఈ 50వ సినిమా ఇంకా పెండింగ్ లోనే ఉంది కానీ బ్యానర్ మాత్రం 58వ సినిమాను పూర్తి చేసింది. ఎప్పుడు ప్లానింగ్, పద్ధతి, విజన్ అనే దిల్ రాజు కూడా ఈ సినిమాకి దర్శకుడు శంకర్ కావడంతో ఏమీ అనలేకపోయారు. అత్తారింటికి దారేది సినిమాలో రావు రమేష్ చెప్పినట్లు ఇప్పటికీ 30 దీపావళిలు వెళ్లాయి కానీ మా బావ ఇంకా రాలేదన్నట్లు ఇప్పటికీ నాలుగు సంక్రాంతి పండుగలు దాటిపోయాయి ఈ సినిమా మాత్రం రిలీజ్ కాలేదు.

అయితే ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ పైన ఎవరికీ క్లారిటీ లేదు అనుకున్న తరుణంలో ఎట్టకేలకు దిల్ రాజు రాయన్ ఫంక్షన్ లో కృష్ణ కలుద్దాం అంటూ ఒక హింట్ ఇచ్చాడు. ఇక్కడితో చాలామంది చరణ్ ఫ్యాన్స్ ఈ సినిమా క్రిస్మస్ కి రిలీజ్ అవుతుంది అని ఊపిరి పీల్చుకున్నారు. రీసెంట్ గా తమన్ కూడా ఈ సినిమాలో ఏడు పాటలు ఉన్నాయి దానిలో సెకండ్ పార్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేము అంటూ మరో అప్డేట్ ఇచ్చాడు. ఇక కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాలో ఇంట్రడక్షన్ సాంగ్ రాసిన అనంత శ్రీరామ్ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పాడు.

- Advertisement -

lyricist Anantha Sriram about Game Changer

ఈ సినిమాలో జరగండి అనే పాట తర్వాత అంత గ్రాండ్ గా ఇంట్రడక్షన్ సాంగును తీశారని. ఆ సాంగ్ ను తనే రాసానని చెప్పాడు. సాంగ్ చాలా బాగుంటుంది రామ్ చరణ్ గారు డైరెక్టర్ ను నమ్మే వ్యక్తి అంటూ చరణ్ ను కొనియాడారు. ఇక ఈ సినిమా గురించి అసలు అప్డేట్ ఇవ్వడం లేదు అని అనుకుంటున్న తరుణంలో మన నిర్మాత, నిన్న మ్యూజిక్ డైరెక్టర్, ఈరోజు లిరిసిస్ట్ మాట్లాడటం అనేది చరణ్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు