Game Changer Songs: సంగీత ప్రియులకు ఫేవరెట్ ఆల్బమ్… ఇది ఫిక్స్ రాసుకోండి

Game Changer Songs: ఒకప్పుడు ఒక సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ ఇవ్వాలంటే అది కేవలం ఆ సినిమాను తీస్తున్న దర్శకుడుకో, నిర్మిస్తున్న నిర్మాణ సంస్థకు ఒక అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళు మాట్లాడిన కూడా ఆ మాటలు ఇప్పుడు వైరల్ గా అయిపోతున్నాయి. ఒక చరణ్ ఫ్యాన్స్ తో పాటు శంకర్ అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా గేమ్ చేంజర్. దాదాపు నాలుగేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాలేదు. ఈ సినిమాతో పాటుగా ఇండియన్ టు సినిమాను కూడా చేశాడు శంకర్. ఆ సినిమా రిలీజై, బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.

ఇక ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నుంచి ఒక పూర్తిస్థాయి సినిమా రాకపోవడం వలన అందరి అంచనాలు ఆశలు గేమ్ చేంజర్ సినిమా పైన ఉన్నాయి. కొన్ని రోజులు ముందు వరకు ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ కూడా ఇవ్వలేదు. దీనిపై చాలామంది రామ్ చరణ్ తేజ్ ఫ్యాన్స్ నిరాశ పడ్డారు. ట్విట్టర్ వేదిక ట్రెండ్స్ కూడా చేశారు. అయితే ఈ సినిమా రీసెంట్ గానే పూర్తి చేసుకున్నట్లు ఫ్యాన్స్ కూడా గ్రహించారు. ఇక ప్రస్తుతం అప్డేట్స్ అన్నీ కూడా వరుసగా వస్తూనే ఉన్నాయి. చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన జరగండి సాంగ్ మినహాయిస్తే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి అఫీషియల్ కంటెంట్ ఏది రిలీజ్ కాలేదు.

Game Changer

- Advertisement -

ఇక రీసెంట్ గా ధనుష్ చేసిన 50వ సినిమా తెలుగు ఈవెంట్ కి నిర్మాత దిల్ రాజు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అక్కడ మాట్లాడుతూ గేమ్ చేంజర్ సినిమా క్రిస్మస్ కి వస్తుంది అని చెప్పారు. ఇక తమన్ కూడా మాట్లాడుతూ ఈ సినిమా లో ఏడు సాంగ్స్ ఉన్నట్లు రివిల్ చేశాడు. హీరో ఎంట్రీ సాంగ్ చాలా బాగా వచ్చింది అది నేనే రాశాను అంటూ అనంతశ్రీరామ్ మాట్లాడారు. ఇక రీసెంట్ గా మరో సాహిత్య రచయిత కాసర్ల శ్యామ్ ఈ సినిమా గురించి , తను రాసిన పాట గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలను పంచుకున్నారు. అయితే ఈ సినిమాలో తను ఒక పాటను రాశానని, ఆ పాట ఫ్యాష్ బ్యాక్ లో వస్తుందని, శంకర్ గారి భారతీయుడు సినిమా కోసం కలిసినప్పుడు మీరు రాసిన పాటని చాలా గ్రాండ్ గా అద్భుతంగా తెరకెక్కించామని చెప్పారట. అయితే ఈ పాట మరో నెల్లూరు నెరజాన రేంజ్ లో ఉండబోతుంది అంటూ శ్యామ్ తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు