Game Changer: రిలీజ్ డేట్ పై ఊహగానాలు, నోరు విప్పని చిత్ర బృందం

Game Changer: కేవలం తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా శంకర్ సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. శంకర్ తమిళ్ లో చేసిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమాలు అని అనుకుంటున్నారు. కానీ ఒకప్పుడు శంకర్ చేసిన ఎన్నో కాన్సెప్ట్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ సబ్జెక్టులు అని చెప్పొచ్చు. అయితే కేవలం సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ అని కాకుండా తన సినిమాలతో ఏదో ఒక మెసేజ్ ను సొసైటీకి ఇస్తుంటారు శంకర్. శంకర్ ప్రస్తుతం చేస్తున్న సినిమా గేమ్ ఛేంజర్.

ప్రతిష్టాత్మకంగా మొదలైన సినిమా

తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన శంకర్ తెలుగులో మొదటిసారి ఒక డైరెక్ట్ ఫిలిం చేస్తున్నారు అన్నప్పుడు అందరి అంచనాలు కూడా వేరే రేంజ్ లో ఉన్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి శంకర్ దర్శకత్వంలో సినిమాను చేయాలని ఎప్పటినుంచో అనుకున్నారు. కానీ ఆ అవకాశం మాత్రం రామ్ చరణ్ కు దక్కింది. త్రిబుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సాధించుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ ను గ్లోబల్ స్టార్ అని కూడా పిలుస్తారు. అయితే గేమ్ చేంజర్ సినిమా దాదాపు 3 ఏళ్ల క్రితం అతిరథ మహారధులు మధ్య అద్భుతంగా మొదలైంది.

Game Changer: Speculations on release date

- Advertisement -

సంక్రాంతి రిలీజ్ అనౌన్స్ చేశారు

అయితే ఎప్పుడో మొదలైన గేమ్ చేంజర్ సినిమాను 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఒక దశలో ఆల్మోస్ట్ క్లారిటీ ఇచ్చారు. అయితే అప్పటికే సినిమా ఇంకా పూర్తి కాకపోవటం సినిమాకు సంబంధించిన పనులు ఉండటం వలన ఆ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. ఇకపోతే ఇప్పుడు సినిమా విషయంలో కేవలం ఆడియన్స్ కు మాత్రమే కాకుండా ఆ చిత్ర యూనిట్ కి కూడా సరైన క్లారిటీ లేదు.

రిలీజ్ డేట్ పై ఊహగానాలు

గేమ్ చేంజర్ సినిమా అక్టోబర్ 30న రిలీజ్ అవుతుంది అని చాలామంది అనుకున్నారు. దాదాపు ఇంకొన్ని రోజుల్లో ఆ సినిమాకు సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్ కూడా వస్తుందని ఊహించారు. కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ ను డిసైడ్ చేయాల్సింది దిల్ రాజు కాదు. ఈ సినిమా రిలీజ్ డేట్ డిసైడ్ చేయాల్సింది శంకర్. ఇకపోతే అందరూ ఊహించినట్టు అక్టోబర్ 31న ఈ సినిమా రిలీజ్ కావడం అనేది కష్టం. ఎందుకంటే ఒకవేళ అక్టోబర్ లో ఈ సినిమాను రిలీజ్ కి ప్లాన్ చేస్తే ఇప్పటినుంచి ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోషన్ ఇదివరకే మొదలవ్వాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు