Game Changer: డిసెంబర్ లో సినిమా రిలీజ్ అయ్యే అవకాశం

Game Changer: ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ ప్రస్తావన వస్తే వాటిలో తప్పకుండా శంకర్ పేరు వినిపించేది. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించాడు శంకర్. మామూలుగా శంకర్ తమిళ్ లో చేసిన ప్రతి సినిమా కూడా తెలుగులో డబ్బింగ్ అవుతూ వచ్చింది. అందుకే శంకర్ కి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇంకా తెలుగు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక గొప్ప సినిమా ఏ భాషలో ఉన్నా కూడా అర్థం కాకపోయినా సబ్ టైటిల్స్ పెట్టుకొని మరీ చూస్తూ ఉంటారు. అలా తమిళ్, కన్నడ, మలయాళం చాలా సినిమాలను చూసి ఆ నటులకు కూడా ఫ్యానిజం చేస్తారు.

ఇకపోతే ప్రస్తుతం రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సాధిస్తున్నాయి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. అయితే ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ కనిపించిన సినిమా ఆచార్య. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని సాధించలేకపోయింది. ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు చాలా మంచి ఒక సినిమా కూడా రాలేదు.

Game Changer

- Advertisement -

ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. శంకర్ తెలుగులో చేస్తున్న స్ట్రైట్ ఫిలిమ్ ఇది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజ్ స్టోరీ అందించాడు. ఇకపోతే కార్తీక్ సుబ్బరాజు అందించిన కథకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ కథను కార్తీక్ సుబ్బరాజ్ చేద్దామని రాసుకున్నాడు కానీ ఈ కథ పూర్తయిన తర్వాత ఇది శంకర్ సార్ రేంజ్ లో ఉంది అని ఆలోచించి శంకర్ కి చెప్పడం జరిగింది.

ఈ సినిమాని చరణ్ తో తీయడానికి ఫిక్స్ అయి మొదలుపెట్టారు. దాదాపు మూడేళ్లు క్రితం మొదలైన ఈ షూటింగ్ రీసెంట్ గానే పూర్తి చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ పైన చాలామందికి డౌట్స్ వస్తూ ఉండేవి. ఇప్పుడు ఈ సినిమా డిసెంబర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఒకవేళ పుష్ప సినిమా వాయిదా పడితే ఖచ్చితంగా డిసెంబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పొచ్చు. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు