Game Changer: గేమ్ చేంజర్ మూవీ టీం రామోజీ రావు కి నివాళి

Game Changer: ఈనాడు సంస్థల అధినేత ప్రముఖ నిర్మాత రామోజీరావు కొద్దిసేపటికి మరణించిన విషయం తెలిసిందే. చాలామంది సినిమా ప్రముఖులు ఈ విషయంపై నివాళులర్పిస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలామంది సినిమా ప్రముఖులు తమ సంఘీభావాన్ని తెలిపారు. కేవలం సినిమా వాళ్ళు మాత్రమే కాకుండా ఎంతో మంది రాజకీయ నాయకులు కూడా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. కొంతమంది షూటింగ్ ప్రదేశాల నుంచి కూడా నివాళులు అర్పిస్తున్నారు.

Game Changer

ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పెడితే ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఈ సినిమాకి సంబంధించి దాదాపు నెలరోజుల పాటు షూటింగ్ మిగిలింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా పైన ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ఇదే ఏడాది రిలీజ్ చేస్తారని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఇకపోతే ప్రస్తుతం రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర యూనిట్ ప్రముఖ నిర్మాత రామోజీరావు మృతి పట్ల నివాళులర్పిస్తూ మౌనం పాటించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రిలీజ్ చేసిన ఫోటోలు ప్రముఖ కమెడియన్, హీరో సునీల్, కమెడియన్ రఘు, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్, దర్శకుడు శంకర్, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా కనిపిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు