Game Changer Update : ఇంకా క్లారిటీ లేదు… మెగా ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేసిన శంకర్

Game Changer Update : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అప్డేట్ గురించి చాలాకాలంగా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇండియన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో గేమ్ ఛేంజర్ గురించి ఏమైనా అప్డేట్ ఇస్తారా? అని ఎదురు చూశారు. చెర్రీ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారేమోనని ఆశగా ఈవెంట్ పూర్తయ్యేదాకా చూశారు. కానీ ఉపయోగం లేకపోయింది. అయితే తాజాగా శంకర్ గేమ్ ఛేంజర్ పై అప్డేట్ ఇవ్వలేదు సరికదా ఓ పెద్ద బాంబ్ పేల్చారు.

ఇంకా క్లారిటీ లేదా?

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా చాలాకాలంగా షూటింగ్ దశలోనే ఉంది. అయితే ఎట్టకేలకు షూటింగ్ అయితే పూర్తయ్యింది ఆన్ శుభవార్తను మేకర్స్ అఫిషియల్ గా పంచుకున్నారు. కానీ ఇప్పటిదాకా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయకపోవడంపై మెగా ఫాన్స్ అసహనంగా ఉన్నారు. జూలై 12న రిలీజ్ కాబోతున్న ఇండియన్ 2 మూవీకి కూడా శంకరే దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలను ఒకేసారి తీయడంతో గేమ్ ఛేంజర్ మాత్రం ఆలస్యమైంది.

Director Shankar has had a record dozen hits in a row since 1993

- Advertisement -

దాదాపు 3 ఏళ్ల తర్వాత ఇటీవలే రామ్ చరణ్ తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. గేమ్ ఛేంజర్ కోసం ఇంకా 10 రోజుల షూట్ భాగం మిగిలి ఉంది. అయితే ఈ సినిమా విడుదల తేదీపై శంకర్ నుంచి ఇంకా క్లారిటీ లేదు. దర్శకుడు ఈ చిత్రాన్ని ఈ ఏడాది విడుదల చేయాలనుకుంటున్నాడో లేదో ఓ నిర్ణయానికి రావడం కష్టంగానే ఉంది. శంకర్ ప్రస్తుతం తన భారతీయుడు 2 కోసం బిజీగా ఉన్నాడు. ఇది ఈ జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రెస్‌తో మాట్లాడిన శంకర్  గేమ్ ఛేంజర్ రిలీజ్ గురించి సరైన సమాధానం ఇవ్వలేదు. సినిమా ఫైనల్ అవుట్‌పుట్ చూసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కానీ నిజానికి టాలీవుడ్ లో వచ్చే 6-8 నెలల వరకు చాలా సినిమాలు లైన్‌లో ఉన్నాయి. కాబట్టి శంకర్ వీలైనంత త్వరగా విడుదల తేదీని నిర్ణయించాలి. లేదంటే ఈ ఏడాది కష్టమే. పుకార్ల ప్రకారం గేమ్ ఛేంజర్ ఈ సంవత్సరం క్రిస్మస్ సీజన్‌ లేదా వచ్చే ఏడాది వేసవిలో రానుంది.

మెగా ఫ్యాన్స్ ఆశలు అడియాశలే

ఎట్టకేలకు ఇండియన్ 2 వచ్చే శుక్రవారం తెరపైకి రాబోతోంది. ఇప్పటికే తమిళంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు ఓ రేంజ్ లో నడుస్తుండగా, తెలుగులో భారీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తో హైప్ పెంచే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే జూలై 7న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో భారతీయుడు 2 మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా, అదే ఈవెంట్ లో గేమ్ ఛేంజర్ ను డిసెంబర్ లో రిలీజ్ చేస్తారని అనౌన్స్ చేస్తారని అంత వెయిట్ చేశారు. కానీ మెగా ఫ్యాన్స్ ఆశలు అడియాశలే అయ్యాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు