Game Changer: ఆ డేట్ కి గేమ్ చేంజర్ పూర్తి అవుతుంది, రిలీజ్ డేట్ ఎప్పుడంటే

Game Changer: జెంటిల్మెన్ సినిమాతో ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శంకర్. అయితే శంకర్ తీసిన ప్రతి సినిమా అప్పుడు సంచలనంగా ఉండేవి. అడ్వాన్స్ గా ఆలోచించే సినిమాలు తీసేవాడు శంకర్. శంకర్ తీసిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉండేవి. కేవలం తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా శంకర్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పొచ్చు. సినిమాను గ్రాండియర్ గా చేయడమే కాకుండా సమాజానికి ఏదో మెసేజ్ ఇవ్వడం కూడా శంకర్ సినిమాలలో మనం గమనించవచ్చు. ఇకపోతే శంకర్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ఇండియన్ 2. ఈ సినిమా జులై 12న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నారు చిత్ర యూనిట్.

ఈ సినిమా ఇంటర్వ్యూస్ లో పలు ఆసక్తికరమైన విషయాలను కూడా చెబితే వస్తుంది చిత్ర యూనిట్. సందర్భంగా శంకర్ మాట్లాడుతూ సినీమాటిక్ యూనివర్స్ గురించి కూడా చర్చకు తీసుకొచ్చాడు. అవెంజర్స్ కంటే ముందే ఈ ఆలోచన వచ్చినట్టు శంకర్ చెప్పాడు. అయితే శంకర్ కి వచ్చి నా కొత్త థాట్ ని అప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోలేకపోయారు. లేకపోతే భారతీయుడు సినిమాతో పాటు శంకర్ చేసిన సినిమా గేమ్ చేంజర్. రామ్ చరణ్ తేజ్ కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

Game Changer

- Advertisement -

దాదాపు నాలుగేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఇప్పటివరకు పూర్తి కాలేదు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక అప్డేట్ తెలుస్తుంది. జులై ఆరవ తారీఖు కు సినిమా కంప్లీట్ గా షూట్ అయిపోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ జరిగిన తర్వాత రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనుంది చిత్ర యూనిట్. అయితే మొత్తానికి ఈ సినిమా 2024 లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు