Game Changer : జరగండి సాంగ్ థియేటర్స్‌లో చూస్తే మాములుగా ఉండదు… మెయిన్‌గా ఓ ట్విస్ట్ కూడా ఉందండోయ్

Thaman: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో థమన్ ఒకరు. ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న చాలా బిగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా థమన్ చేతిలో ఉన్నాయని చెప్పొచ్చు. అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత థమన్ రేంజ్ విపరీతంగా మారిపోయింది. స్టార్ డైరెక్టర్స్ స్టార్ హీరోస్ అంతా కూడా థమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు అని చెప్పొచ్చు. థమన్ మ్యూజిక్ తో పాటు అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఇవ్వడం మొదలుపెట్టాడు. ఒక మంచి కథ మంచి మ్యూజిక్ ను తీసుకుంటుంది. అని చెబుతూ ఉంటాడు థమన్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో నటిస్తున్న ఓజి సినిమాకి సంగీత అందిస్తున్నాడు థమన్. ఇదివరకే ఈ సినిమాకి సంబంధించిన హంగ్రీ చితా అనే సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ సాంగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం మారుతి దర్శకత్వం వహిస్తున్న రాజా సాబ్ అనే సినిమా కూడా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో ఒక కమర్షియల్ ఆల్బమ్ ఇవ్వబోతున్నట్లు ఇదివరకే అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేశాడు.

Game Changer

- Advertisement -

ఇక ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టుతో పాటు గేమ్ చేంజర్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజు కథ అందించాడు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ఈ సినిమా నుంచి జరగండి అనే పాటను రిలీజ్ చేసింది చిత్రం యూనిట్. అయితే ఈ పాటలో ఒక హుక్ స్టెప్ దాచి ఉంచారట. ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 3 కి జడ్జ్ గా తమన్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఒక సింగర్ ఈ పాటను పాడినప్పుడు. ఈ పాటకు సంబంధించిన విజువల్స్ నేను చూశాను దీనిలోని హుక్ స్టెప్ ని పాటలో చూపించలేదు. ఈ పాట థియేటర్లో మారు మోగిపోద్ది. చరణ్ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ లా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు