Bharateeyudu2 : ఇండియన్2 లో గేమ్ ఛేంజర్ బిట్స్.. మరో సినిమా కూడా..

Bharateeyudu2 : పాన్ ఇండియా వైడ్ గా రెండు వారాల పాటు కల్కి సినిమా హవానే నడిచిందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా జోరు తగ్గగా, లేటెస్ట్ గా పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలతో ఇండియన్2 సినిమా రిలీజ్ కావడం జరిగింది. ఈరోజునే (జులై12) భారీ అంచనాలతో సినిమా విడుదల కాగా, థియేటర్ల వద్ద అభిమానులు ప్రీమియర్స్ షోలకే ఎగబడ్డారు. ముఖ్యంగా తమిళనాడులో కమల్ హాసన్ ఫ్యాన్స్ ఒకరోజు ముందే థియేటర్ల వద్ద పడిగాపులు కాసారు. ఇక శంకర్ షణ్ముగం కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇండియన్ సినిమాకి సీక్వెల్ గా ఇండియన్2 తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక తెలుగు లో ఈ సినిమాను భారతీయుడు2 (Bharateeyudu2) పేరుతో విడుదల చేసారు.

మిశ్రమ స్పందన తెచ్చుకున్న భారతీయుడు2..

దాదాపు 28 యేళ్ళ తర్వాత ఈ కాంబోలో సినిమా రావడంతో ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఏర్పడగా, థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. భారతీయుడు2 ని భారీ హంగులతో శంకర్ తెరకెక్కించగా, ఆ సినిమాకి కమల్ హాసన్ సేనాపతి గా పూర్తి న్యాయం చేసారు. అయితే బోరింగ్ స్క్రీన్ ప్లే వల్ల సినిమాని సాగదీశారని చూసిన ఆడియన్స్ కొంతమంది అంటున్నారు. ఇకపోతే సినిమాలో సేనాపతి ఎంట్రీ కూడా ఆలస్యంగా ఉంటుందని, కమల్ కన్నా ఎక్కువ సేపు సిద్ధార్థ్ ఉంటాడని అందువల్ల ఫ్యాన్స్ కాస్త డిస్సపాయింట్ అయ్యారని అంటున్నారు. పైగా సేనాపతి ఎంట్రీ తర్వాత కూడా సినిమా స్లో గానే సాగుతుందని చూసిన ఆడియన్స్ అంటున్నారు. అయితే ఫైనల్ గా మొదటి రోజు అయ్యాక టాక్ ఎలా ఉంటుందో చూడాలి.

GameChanger Jaragandi Song Reference in Bharateeyudu2 Movie

- Advertisement -

భారతీయుడు2 లో గేమ్ చేంజర్ జరగండి బిట్, కుర్చీమడత కూడా..

ఇక భారతీయుడు2 సినిమాలో తాజాగా ఓ సన్నివేశంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో జరగండి సాంగ్ బిట్ ని కూడా వాడారట. ఓ బస్సు జర్నీ సన్నివేశంలో ఆ పాట ని ప్లే చేయడం జరిగింది. అలాగే మరో సన్నివేశంలో గుంటూరు కారంలో కుర్చీ మడత బెట్టి సాంగ్ బిట్ ని కూడా వాడారట. అయితే ఈ సీన్లు చూసిన నెటిజన్లు ఈ సన్నివేశాలపై చేసిన ఫోకస్ స్క్రీన్ పైనా పెట్టి ఉండాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన బిట్స్ ని లీక్ చేసి ఆయా హీరోల అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక భారతీయుడు2 ఫైనల్ రివ్యూ మరి కాసేపట్లో రానుండగా, ఈ సినిమా తొలిరోజు 50 నుండి 55 కోట్ల వరకు ఓపెనింగ్స్ తెచ్చుకోనున్నట్టు సమాచారం.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు