Game Changer : ఏడు పాటలున్నాయి, ఏది సెకండ్ సింగిల్ గా రిలీజ్ చేస్తామో తెలియదు

Game Changer : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ అందరులో రాంచరణ్ నుంచి ఒక సినిమా వచ్చి చాలా రోజులైంది. కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ఆచార్య సినిమాలో కొంత మేరకు కనిపించినా కూడా ఆ సినిమా అభిమానులకు సంతృప్తిని ఇవ్వలేదు. ఇకపోతే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సాధించుకున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా తర్వాతే గ్లోబల్ స్టార్ అని ఇమేజ్ ని కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ చేస్తున్న సినిమా గేమ్ చేంజర్.

దాదాపు నాలుగేళ్ల క్రితం మొదలైంది ఈ సినిమాపై ఇప్పటికీ మంచి అంచనాలు ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి ఇదివరకే జరగండి అని ఒక పాట కూడా రిలీజ్ అయింది. తమన్ కంపోజ్ చేసిన ఈ పాట అద్భుతమైన హిట్ అయింది. శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు 2 సినిమాలో కూడా ఈ పాట విన్నప్పుడు చాలామంది ఆడియన్స్ కి మంచి హై వచ్చింది. కేవలం ఒక సీన్లు కొంతసేపు ఈ పాట వినిపిస్తేనే ఒక హై వచ్చింది అంటే కంప్లీట్ సాంగ్ కి ఎంత హై వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గేమ్ చేంజర్ సినిమా కోసం చాలామంది క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు.

Game Changer (2024) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

- Advertisement -

ఇక రీసెంట్ గా ధనుష్ నటిస్తున్న రాయన్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన దిల్ రాజు ను ఈ సినిమా గురించి అప్డేట్ అడిగినప్పుడు క్రిస్మస్ కి కలుద్దాం అంటూ చెప్పుకొచ్చాడు. దీనితో ఈ సినిమా క్రిస్మస్ బరిలో రిలీజ్ కానున్నట్లు క్లారిటీ ఇచ్చేసినట్లే. ఇక రీసెంట్ గా తమన్ కూడా ఈ సినిమా సాంగ్స్ గురించి ఒక అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాలో మొత్తం ఏడు పాటలు ఉన్నాయట. దీంట్లో సెకండ్ పాట ఏది రిలీజ్ చేస్తారు తెలియదు అంటూ చెప్పుకొచ్చాడు. అంటే దీనిబట్టి గేమ్ చెంజర్ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ మొత్తం ఫినిష్ అయిపోయింది అని చెప్పొచ్చు. ఇంకా ఎడిటెడ్ వర్షన్ అయిపోతే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మీద కూర్చునే పని మాత్రమే థమన్ కి మిగిలింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు