Ganesh K Babu: మొత్తానికి యంగ్ డైరెక్టర్ కి స్టార్ హీరో సెట్ అయ్యాడు

Ganesh K Babu: తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో రిలీజ్ అయిన సినిమాల్లో దాదా అనే సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంత పెద్ద హిట్ సాధించిన తర్వాత కూడా సరైన అవకాశం ఆ దర్శకుడికి రాలేదు అనుకుంటున్న తరుణంలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఈ సినిమాకి దర్శకత్వం వహించిన గణేష్ కే బాబు నెక్స్ట్ జయం రవితో సినిమాను చేయనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమాను స్క్రీన్ సీన్ కంపెనీ నిర్మించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి లేకపోతే ఇదే కంపెనీలో జయం రవి ఇదివరకే బ్రదర్ అనే సినిమాను కంప్లీట్ చేశాడు.

మామూలుగా ఏ సినిమా ఎవరికి చేసే అదృష్టం దొరుకుతుంది ఎవరు ఊహించలేరు. దాదా సినిమా అయిపోయిన తర్వాత చాలా ప్రయత్నాలు చేశాడు గణేష్. అయితే ఇతరుణంలో తమిళ్ లో ఉన్న ఇద్దరు యంగ్ హీరోస్ అయినా దృవ్ విక్రమ్, జీవా కీ కథను చెప్పాడు గణేష్. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఎట్టకేలకు జయం రవి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తని వరువన్ సినిమా ఇప్పుడు అవుతుంది అని వార్తలు కూడా ఆగిపోయాయి.

Dada: Ganesh K Babu

- Advertisement -

తని వరువన్ సినిమా తమిళ్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిందా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోహన్ రాజా తెరకెక్కించిన బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. ఇదే సినిమాను సురేందర్ రెడ్డి రామ్ చరణ్ హీరోగా ధ్రువ పేరుతో తెలుగులో తెరకెక్కించాడు. చరణ్ కెరియర్ లో ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాడు మోహన్ రాజా. అయితే జయం రవి ప్రస్తుతం వేరే ప్రాజెక్టులో బిజీగా ఉండటం వలన ఈ ప్రాజెక్టు గురించి అధికార ప్రకటన ఇంకా చేయలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు