Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ డే కలెక్షన్స్

Gangs of Godavari: సాహిత్య రచయితగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కృష్ణ చైతన్య చాలా అద్భుతమైన సినిమాల్లో మంచి పాటలను అందించాడు. రౌడీ ఫెలో సినిమాతో దర్శకుడుగా మారి మంచి గుర్తింపును సాధించాడు. ఆ తర్వాత దర్శకుడుగా కొనసాగుతాడు అనుకున్న తరుణంలో మళ్లీ కొన్ని సినిమాలకు పాటలను రాసి, చల్ మోహన్ రంగ సినిమాతో రెండవ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న విజయాన్ని సాధించలేదు. రీసెంట్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో మరోసారి దర్శకుడిగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమా మే 31న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. నిన్ననే రిలీజ్ అయిన ఈ సినిమా గురించి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.

డ్రీమ్ రోల్

విశ్వక్సేన్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కూడా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక కథను ఎంచుకుంటే, తర్వాత మరో విభిన్నమైన కథను ఎంచుకుని సినిమా చేయటం విశ్వక్సేన్ కి అలవాటు. తన కెరియర్ లో ఎన్నో ఎక్స్పరిమెంటల్ ఫిలిమ్స్ కూడా చేశాడు. ఇకపోతే నిన్న రిలీజ్ అయిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో లంకల రత్న అనే పాత్రలో కనిపించాడు విశ్వక్. ఇదివరకే ఈ పాత్ర తనకు చాలా ప్రత్యేకమని. ఇది తనకు డ్రీమ్ రోల్ అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ఫస్ట్ అఫ్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సెకండ్ హాఫ్ విషయంలో కొద్దిపాటి విమర్శలు వినిపించాయి.

Gangs of Godavari First Day Collections

- Advertisement -

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కలెక్షన్స్

ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు మంచి కలెక్షన్స్ ను వసూలు చేసింది. ఇప్పటివరకు విశ్వక్సేన్ కెరియర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ఈ సినిమాతో వచ్చాయని చెప్పొచ్చు. ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే..
Nizam – 1.10 cr
Vizag – 46 L
East – 28 L
West – 24L
Guntur – 30 L
Nellore – 17 L
Krishna – 21 L
Ceeded – 76 L
Total AP, TS Day 1 share 3.52 Crs

సినిమా మొదటి రోజు 3 కోట్లకు పైగా వసూల్ చేసింది.

పార్ట్ 100% ఉంటుంది

వరకు వసూలు చేశాయి. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉందని ఇదివరకే అనౌన్స్ చేశారు. కానీ సినిమాలో మాత్రం దీనికి సంబంధించిన లీడ్ ఇవ్వలేదు. కానీ రీసెంట్గా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో ఈ సినిమాకి సంబంధించిన లీడ్ తన ఫోన్లో ఉందని విశ్వక్సేన్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే దీనికి 100% పార్ట్ 2 ఉంటుందని కృష్ణ చైతన్య కూడా కన్ఫర్మ్ చేశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు