Gangs Of Godavari : గ్యాంగ్స్ అఫ్ గోదావరి బ్రేక్ ఈవెన్ టార్గెట్.. హైప్ కి బిజినెస్ కి సంబంధం లేదు

Gangs Of Godavari : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన విశ్వక్ సేన్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ దాస్ కా ధమ్కీ, ఈ ఇయర్ గామి సినిమాలతో సూపర్ హిట్లు దక్కించుకోగా, ఇప్పుడు హ్యాట్రిక్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. వరుస సక్సెస్ ల తర్వాత ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” (Gangs Of Godavari) సినిమాతో సందడి చేయబోతూ ఉండగా, ఈ సినిమా ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం (మే31) న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాకు పోటీగా ఇతర సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఈ వీకెండ్ హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఇక సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 500 వరకు స్క్రీన్స్ లో రిలీజ్ కానుండగా వరల్డ్ వైడ్ గా 650 కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇక బిజినెస్ పరంగానూ మిగతా సినిమాల కన్నా సాలిడ్ గా గ్యాంగ్స్ అఫ్ గోదావరి థియేట్రికల్ బిజినెస్ చేసింది.

Gangs Of Godavari movie business & break even target

సాలిడ్ బిజినెస్ చేసిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి..

ఇక గ్యాంగ్స్ అఫ్ గోదావరి Gangs Of Godavari సినిమా తెలుగు రాష్ట్రాల వాల్యూ బిజినెస్ రేంజ్ 8 కోట్ల దాకా ఉండగా వరల్డ్ వైడ్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ 10 కోట్ల దాకా ఉంటుందని అంచనా. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ కావాలంటే, మినిమమ్ 11 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే సరిపోతుంది. ఇక ఈ సినిమా సోలో రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా బిజినెస్ ఎక్కువగానే జరిగి ఉండేది. కానీ ఇతర సినిమాల పోటి వలన ఆల్ మోస్ట్ రీజనబుల్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా, ఓపెనింగ్స్ నుండే మంచి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమాకి పాజిటివ్ టాక్ కనుక ఆడియన్స్ నుండి వస్తే ఈజీగా టార్గెట్ ను అందుకుని లాభాలను కూడా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

- Advertisement -

హ్యాట్రిక్ హిట్ దక్కుతుందా?

ఇక బాక్ టు బాక్ హిట్స్ తో మంచి జోరు మీద ఉన్న విశ్వక్ సేన్ ఈ సినిమాతో కూడా అంచనాలను అందుకుంటే హ్యాట్రిక్ హిట్ ని కంప్లీట్ చేసుకోవడమే కాదు, తన మార్కెట్ రేంజ్ ని కూడా పెంచుకునే అవకాశం ఉంది. ఇక గ్యాంగ్స్ అఫ్ గోదావరిని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మించగా, కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాడు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించాడు. ఇక ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా, అంజలి ప్రత్యేక పాత్రలో నటించింది. నాజర్, సాయి కుమార్, గోపరాజు రమణ, హైపర్ ఆది, మధు నందన్, ప్రవీణ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ ని చూపిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు