Gangs of Godavari inside Talk: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఫస్ట్ రివ్యూ

Gangs of Godavari inside Talk: వెళ్ళిపోమాకే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విశ్వక్సేన్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు. ఆ తర్వాత తనలో ఉన్న టాలెంట్ ని బయటకు తీసి ఫలక్నామా దాస్ సినిమాతో దర్శకత్వ ప్రతిభను బయటకు తీశాడు. అక్కడ నుంచి విశ్వక్సేన్ కి ఒక సెపరేట్ ఫ్యామిలీ ఏర్పడింది. ఆ తర్వాత సైలెస్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు.

విభిన్న కథలను ఎంచుకున్నాడు

ఆ తర్వాత వచ్చిన పాగల్ సినిమా పరవాలేదు అనిపించుకుంది. అశోక వనంలో అర్జున కళ్యాణం అనే సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఓరి దేవుడా సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. మళ్లీ దర్శకుడుగా ధమ్కీ అనే సినిమాను చేసి కమర్షియల్ సక్సెస్ ను సాధించాడు. ఇప్పటివరకు విష్వక్సేన్ తన కెరీర్లో ఎన్నో ఎక్స్పరిమెంటల్ ఫిలిమ్స్ చేస్తూ వచ్చాడు. ప్రతి సినిమాకి పంథాను మార్చుకుంటూ విభిన్నమైన కాన్సెప్ట్లను ఎంచుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన గామి సినిమా కూడా అటు కమర్షియల్ గాను సక్సెస్ సాధించి మంచి ప్రశంసలు అందుకుంది.

Gangs of Godavari

- Advertisement -

రిలీజ్ కి సిద్ధంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సాహిత్య రచయితగా అడుగుపెట్టాడు కృష్ణ చైతన్య. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో మంచి సాహిత్యాన్ని అందించాడు. రౌడీ ఫెలో అనే సినిమాతో దర్శకుడుగా మారి సక్సెస్ సాధించాడు. రౌడీ ఫెలో సినిమా తర్వాత దర్శకుడుగానే కొనసాగుతాడు అనుకున్న తరుణంలో మరికొన్ని పాటలను కూడా రాశాడు. ఆ తర్వాత నితిన్ హీరోగా చేసిన చల్ మోహన్ రంగా అనే సినిమాతో రెండవసారి మెగా ఫోన్ పట్టుకున్నాడు. అయితే ఆ సినిమా ఊహించిన విజయాన్ని సాధించలేదు. ఆ సినిమా తర్వాత డైరెక్షన్కు కొంచెం గ్యాప్ ఇచ్చి ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్నాడు. ఈ సినిమా మే 31న విడుదల కానుంది.

గ్యాంగ్ ఆఫ్ గోదావరి ఫస్ట్ రివ్యూ

ఇకపోతే గ్యాస్ ఆఫ్ గోదావరి ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంది. ట్రైలర్ చూడగానే సినిమా అద్భుతంగా ఉండబోతుంది ఆ నెంబర్ కి ఒక అవగాహన కూడా వచ్చింది. ఎంతసేపు గోదావరి ఏంటి మర్యాదలు మాత్రమే కాకుండా అక్కడ కూడా ఎవరికీ తెలియని కథలు ఉన్నాయి అంటూ ఒక ఫిక్షనల్ కథను డిజైన్ చేశాడు కృష్ణ చైతన్య. అయితే ఈ సినిమాకు సంబంధించి సినిమా ఫస్ట్ ఆఫ్ మాత్రం అదిరిపోయింది అనే టాక్ వినిపిస్తుంది. సెకండాఫ్ విషయానికి వస్తే కొంత మేరకు యావరేజ్ అనే టాక్ వినిపిస్తుంది. ఏదేమైనా మొత్తానికి ఈ సినిమా సేఫ్ జోన్ లో ఉంటుందని చాలామంది అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకి కృష్ణ చైతన్య రాసిన డైలాగ్స్ కూడా క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు