Gangs of Godavari: ఓటీటీలోకి విశ్వ‌క్ సేన్ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. కొంతమంది మాస్ హీరోలు అయితే మరి కొంతమంది క్లాస్ హీరోలు ఉన్నారు. అయితే మాస్ హీరోలలో విశ్వక్ సేన్ ను మించినవారు ఎవరూ లేరని అందరూ చెబుతూ ఉంటారు. ఇండస్ట్రీలో చాలా కష్టపడి పైకి వచ్చిన హీరోలలో విశ్వక్ ఒకడు. చాలా డిఫరెంట్ కథాంశాలతో విశ్వక్… తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు.

ఇలాంటి నేపథ్యంలోనే తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్. ఈ సినిమా ఆరంభంలో మిక్స్డ్ టాక్ వచ్చిన… ఆ తర్వాత రెస్పాన్స్ బాగానే వచ్చింది. కలెక్షన్లను కూడా బాగానే వసూలు చేసింది అని చెబుతున్నారు. కృష్ణ చైతన్య తీసిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై తీశారు. ఈ సినిమాకు నిర్మాతలుగా నాగవంశీ, సాయి సౌజన్య వ్యవహరించారు.

Image

- Advertisement -

ఇక ఇందులోనే ఆశక్తి హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. అంజలి అలాగే నాజర్ కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ తాజాగా వచ్చేసింది. ఈ సినిమా ఓటిటి అప్డేట్ ఇస్తూ కీలక ప్రకటన చేసింది చిత్ర బృందం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. జూన్ 14వ తేదీ నుంచి తెలుగు, కన్నడ మలయాళం అలాగే తమిళ భాషలలో రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో విశ్వక్ ఫాన్స్ ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు.

https://x.com/Binged_/status/1799655380605427918

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు