GARGI Trailer : తండ్రి కోసం పోరాటం

లేడి ఓరియెంటెడ్ సినిమాలు అంటే, ఏదో థ్రిల్లర్, హారర్ జోనర్ లో వస్తాయని అనుకుంటారు. కానీ డ్రామా జోనర్ లో వస్తాయని ఎవరూ ఊహించరు. డ్రామా జోనర్ లో వచ్చే సినిమాలను ప్రేక్షకలు ఆదరించడం కూడా కష్టమే. అందుకే దర్శకులు ఈ జోనర్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ధైర్యం చేయరు.

కానీ తమిళ దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ ధైర్యం చేసి డ్రామా జోనర్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమా తెరకెక్కించాడు. డైరెక్టర్ గౌతమ్ రామచంద్రన్ ఈ ధైర్యం చేయడానికి రెండు కారణాలు ఉండచ్చు.
ఒకటి స్టోరీ, రెండు లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ఉండటం అని చెప్పొచ్చు. అందుకే సాయి పల్లవితో “గార్గి” అనే ద్వి భాష చిత్రాన్ని తెరకెక్కించాడు.

ఈ గార్గి ట్రైలర్ ను కాసేపటి క్రితం మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తూంటే, టీచర్ ఉద్యోగం చేస్తున్న ఒక మధ్య తరగతి యువతి కథ అని అర్థమవుతుంది. తండ్రి ఓ కేసులో అరెస్టు అయితే, కూతురు న్యాయం కోసం చేసే పోరాటమే ఈ “గార్గి” అని తెలుస్తుంది.

- Advertisement -

సాధారణంగా కోర్టులు, కేసులు అంటే యువకులు కూడా వెనకడుగు వేస్తారు. కానీ, ఓ యువతి తన తండ్రిని కాపాడటానికి పోలీసు స్టేషన్లు, కోర్టు మెట్లు ఎక్కడం కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంది.
అలాగే, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ఎప్పటి లాగే నటనతో ఆకట్టుకుంటుంది. ట్రైలర్ ను చూస్తే, ఈ సినిమా మొత్తం వన్ ఉమెన్ షో ఉన్నట్టు అర్థమవుతుంది.

మొత్తంగా “గార్గి” ట్రైలర్ సినిమా అంచనాలను భారీగానే పెంచింది. కాగా, ఈ సినిమా తమిళం, తెలుగు భాషలలో ఈ నెల 15న థియేటర్స్ లో విడుదల కాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు