Gowri Krishna : నా అనుమతి లేకుండానే పొలిమేర 3ని వంశీ అనౌన్స్ చేశారు… ఫిల్మ్ ఛాంబర్‌కు నిర్మాత ఫిర్యాదు

Gowri Krishna : ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదల అయ్యే సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.. అలాంటి సినిమాలలో పొలిమేర, పొలిమేర 2 సినిమాలు కూడా ఉన్నాయి.. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను అందుకోవడంతో పాటుగా భారీ కలెక్షన్స్ ను కూడా అందుకున్నాయి.. ఆ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా రాబోతుందని మేకర్స్ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈ విషయం పై తనకు అన్యాయం జరుగుతుందని నిర్మాత ఫిలిం చాంబర్ లో ఫిర్యాదు చేశారు.. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.. అసలు ఏం జరిగిందంటే..

ఈ సినిమా నిర్మాత శ్రీ గౌరీ కృష్ణ దిల్ రాజుకు, ఫిలిం చాంబర్ కు ఫిర్యాదు చేశారు.. ఆయనను వంశీ నందిపాటి మోసం చేస్తున్నారని, ప్రొడక్షన్ హౌస్ లో జరుగుతున్న అన్యాయాలను బయటపెడుతూ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.. పొలిమేర సినిమాలు మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి.. గతంలో కృష్ణ ప్రోడక్షన్ బ్యానర్ పై ఈ సినిమా వచ్చింది.. ఇప్పుడు వంశీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై పొలిమేర 3 అనౌన్స్ చేసినట్లు గౌరి కృష్ణ ఫిర్యాదు చేశాడు.. ఇప్పుడు తన అనుమతి లేకుండా వంశీ నందిపాటి పొలిమేర 3 అనౌన్స్ చేశారు.. నా కంటెంట్ ను తప్పుడుగా వినియోగించారు.. నన్ను దారుణంగా మోసం చేశారు.. నా ప్రమేయం లేకుండా ఇదంతా జరుగుతుంది.. నేను గతంలో ఈ విషయం పై కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు.. దయచేసి నా మనవిని విని ఈ విషయం పై నాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ ఫిర్యాదులో పేర్కొన్నాడు.. ప్రస్తుతం ఈ విషయం పై ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

This is a letter filled out by Gauri Krishna
This is a letter filled out by Gauri Krishna

గౌరీ కృష్ణ దిల్ రాజుకు రెండు పేజీలు లేఖ రాశారు.. ఆ లేఖలో ఆయనను సినిమా నుంచి తప్పించినట్లు చెప్పుకొచ్చాడు.. వంశీ నందిపాటి తనపై కుట్ర పన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.. అతని తో పాటుగా ప్రసన్న కుమార్ కూడా నన్ను బెదిరించి తప్పుడు సంతకాలు చేయించుకొనేందుకు ప్రయత్నించాడు. నాకు ప్రాణ హాని కూడా ఉంది.. ఈ సందర్బంగా నేను తెలియజేసేది ఏంటంటే.. పొలిమేర 2 టైం లో నేను ఇచ్చిన సంతకాలు చేసిన ఖాళీ చెక్కులను, బాండు లను నాకు తిరిగి ఇచ్చేయ్యాలని కోరారు. పెద్ద నిర్మాతలు ఈ విషయాన్ని గమనించి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాను అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నాడు… మరి దీనిపై నిర్మాతల మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు