Gautam Vasudev Menon : మలయాళం లో డెబ్యూ ఇవ్వనున్న మినీ లవ్ గురు

Gautam Vasudev Menon : ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో లవ్ స్టోరీలు తీసే దర్శకులు అని అంటే టక్కున గుర్తొచ్చేది మణిరత్నం. మణిరత్నం ఏ జోనర్ లో సినిమా చేసినా కూడా మణిరత్నం ప్రత్యేకమైన జోనర్ అంటే మాత్రం లవ్ స్టోరీస్ అని చెప్పాలి. తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన లవ్ స్టోరీలని తెరకెక్కించారు మణిరత్నం. అందుకనే చాలామంది మణిరత్నం ను లవ్ గురు అని అంటారు. మణిరత్నం చేసిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ఇకపోతే మణిరత్నం తర్వాత ఆ స్థాయిలో సినిమా చేయగలిగే దర్శకులు ఎవరైనా ఉన్నారు అంటే అది గౌతం వాసుదేవ్ మీనన్ అని చెప్పొచ్చు.

గౌతమ్ వాసుదేవ్ మీనన్ సినిమాల్లో లవ్ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అమ్మాయిని చాలా అందంగా చూపించడంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముందుంటారు. గౌతమ్ సినిమాల్లో అమ్మాయిలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటారు. హీరోలు కూడా అంతే హ్యాండ్సమ్ గా ఉంటారు. ఆ సినిమాల్లో లాంగ్వేజ్ కూడా చాలా బాగుంటుంది. మణిరత్నం గౌతమ్ వాసుదేవ్ మీనన్ సినిమాల్లో ఒక కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటుంది అది లవ్ స్టోరీ కి ఒక బ్యూటీ ని తీసుకొస్తుంది.

Ye Maaya Chesave Samantha

- Advertisement -

ఇకపోతే తమిళ్ లో ఎన్నో అద్భుతమైన లవ్ స్టోరీస్ ని తెరకెక్కించిన గౌతమ్. తెలుగులో కూడా సినిమాలు చేశారు. అందులో నాగచైతన్యతో నానితో చేసిన సినిమాలు ప్రత్యేకమని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం మలయాళం ఇండస్ట్రీలో కూడా గౌతం వాసుదేవ్ మీనన్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మమ్ముట్టి సమంత లను ప్రధాన పాత్రలలో చూపించి మలయాళ ఇండస్ట్రీకి డెబ్యూ ఇవ్వనున్నారు గౌతమ్ వాసుదేవ్. అయితే దీని గురించి అధికార ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు