Gautham VasuDev Menon: రాజమౌళిని ఇంట్లో పెట్టి బలవంతంగా తలుపులేసి ఆ సినిమాను చూపించాడట

Gautham VasuDev Menon: కేవలం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని మాత్రమే కాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఫెయిల్యూర్ ఎరగని ఏకైక దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడుగా పరిచయమైన రాజమౌళి వరుసగా హిట్ సినిమాలు చేస్తూ తన స్థాయిని పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. కేవలం తన స్థాయిని పెంచడం మాత్రమే కాకుండా భారతీయ సినిమా స్థాయిని కూడా పెంచాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా తర్వాత ప్రపంచ సినిమా అంతా తెలుగు సినిమా వైపు చూసింది అని చెప్పొచ్చు. అక్కడితోనే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు.

ఎన్టీఆర్, రామ్ చరణ్ లను హీరోగా పెట్టి ట్రిపుల్ ఆర్ అనే మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాతో తెలుగు సినిమాను శిఖరం మీద కూర్చోబెట్టడు రాజమౌళి. ఇకపోతే రాజమౌళి కేవలం యాక్షన్ ఫిలిమ్స్ మాత్రమే తీస్తూ ఉంటాడు. ఒక సందర్భంగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో మాట్లాడుతూ నాకు లవ్ స్టోరీస్ నచ్చవు నాకు యాక్షన్ ఫిలిమ్స్ నచ్చుతాయి. సో నేను ఎక్కువగా లవ్ స్టోరీస్ చూడను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఒక సందర్భంలో తన కొడుకు కార్తికేయ ఏం మాయ చేసావే సినిమాను దాదాపు 20 సార్లకు పైగా చూసాడని చెప్పుకొచ్చాడు.

Ye Maaya Chesave

- Advertisement -

కార్తికేయ ఏమాయ చేసావే సినిమా 20 సార్లు చూసిన తర్వాత బలవంతంగా ఎస్ఎస్ రాజమౌళిని ఒక రూమ్ లో పెట్టి తలపేసి ఆ డివిడి పెట్టేసి వెళ్లిపోయాడట. అలా బలవంతంగా ఏమాయ చేసావే సినిమాను చూపించాడు కార్తికేయ. ఇదే విషయాన్ని ఒక సందర్భంలో గౌతమ్ వాసుదేవ్ తో చెప్పాడు రాజమౌళి. అలానే అలాంటి ఒక హీరో క్యారెక్టర్ ను ఎలా రాశారు అని అడిగినప్పుడు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ మీ కొడుకు లైఫ్ లో కూడా ఒక జెస్సి ఉండే ఉంటుంది. అలాగే మన చుట్టూ చాలామంది జెస్సీ లు ఉంటారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇదేమైనా రాజమౌళి చెప్పినట్టు ఆయన సినిమాల్లో యాక్షన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఈగ, మగధీర సినిమాలలో మినహాయిస్తే ఎక్కువగా లవ్ స్టోరీ దేనిలో కూడా కనిపించదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు