Genelia: రియంట్రీ ఇవ్వబోతున్న జెనీలియా.. ఏ మూవీ తో అంటే..!

Genelia: ఒకప్పటి సౌత్ ముద్దుగుమ్మ జెనీలియా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ గత కొంతకాలం నుంచి తెలుగులో ఎటువంటి సినిమాలు చేయలేదు. ఇక తాజాగా ఈమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

బాలీవుడ్ యాక్టర్ రితేష్ ని జెనీలియా ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పైగా చాలా గ్యాప్ తర్వాత జెనీలియా తన భర్తతో కలిసి వేద్ అనే సినిమా చేసింది. ఇక ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ. జెనీలియా కు ఇటు తెలుగు తో పాటు అటు తమిళంలో కూడా మంచి గుర్తింపు ఉంది.

The star hero committed suicide attempt for Genelia..!
The star hero committed suicide attempt for Genelia..!

హోమ్లీనెస్ కి క్యారాఫ్ అడ్రస్ గా ఉండే జనీలియాకు ఇప్పటికీ యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక అందుకే శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్నా ఓ తమిళ్ సినిమాలో ఆమెకు చాన్స్ వచ్చినట్లు టాక్ నడుస్తుంది. భవిష్యత్తులో జెనీలియా ఇటు తెలుగు సినిమాల్లో కూడా నటించే ఛాన్స్ ఉంది. ఇక ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ కి బాగానే డిమాండ్ ఉంది. మరి సపోర్టింగ్ రూల్స్ అయిన ప్లే చేసి జెనీలియా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకోగలదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు