Ginna: ఓటిటీ రిలీజ్ డేట్ ఫిక్స్

మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘జిన్నా’. గత కొన్నేళ్లుగా ఈయన సినిమాలు తగ్గించాడు. మా అధ్యక్షుడు అయిన తర్వాత ఈయన నటించిన విడుదలైన మొదటి చిత్రం ‘జిన్నా’. ఈ చిత్రంలో విష్ణు సరసన శృంగార తార సన్నిలియోన్, హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటించారు. నూతన దర్శకుడు సూర్య తెరకెక్కించారు. మంచు మోహన్ బాబు ఈ సినిమాకు స్వయంగా స్క్రీన్ ప్లే సమకూర్చడంతో పాటు నిర్మాతగా వ్యవహరించారు. ఇక మంచు విష్ణు నటించిన జిన్నా సినిమాతో పాటు విడుదలైన డబ్బింగ్ చిత్రాలు సర్దార్, ప్రిన్స్, నిన్న మొన్న వచ్చిన విశ్వక్సేన్ హీరోగా నటించిన ‘ఓరి దేవుడా’ చిత్రాలకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

ఇదిలా ఉంటే, అక్టోబర్ 21న రిలీజ్ అయిన ఈ సినిమా మొత్తానికి ఓటీటీ లోకి వస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సొంతం చేసుకుంది. నేటి నుంచి జిన్నా మూవీ ప్రైమ్ వీడియోలోకి రానుంది. థియేటర్ లో మిస్సయిన ప్రేక్షకులు టీవీల్లో ఈ సినిమా ఎంజాయ్ చేయొచ్చు. కాగా, ఓ అమ్మాయి రూపంలో మరో యువతి ఆత్మగా రావడం, అందరిని భయపెట్టడం అనే పాయింట్ తో తెలుగులో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఈ రొటీన్ పాయింట్ కు చాలా కొద్దిగా మార్పులు చేస్తూ జిన్నా సినిమాలు రూపొందించిన రచయిత కోన వెంకట్, దర్శకుడు ఈశాన్ సూర్య ప్రేక్షకుల్ని మెప్పించాలని ప్రయత్నించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు