Anjali: పెళ్లి పై క్లారిటీ ఇస్తూ.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన హీరోయిన్ అంజలి..!

Anjali: హీరోయిన్ అంజలి మనందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు అంజలి చిత్రంతో తమిళ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక అనంతరం ఫోటో సినిమా లో నటించింది. కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బలుపు, గీతాంజలి వంటి చిత్రాలతో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ.

ప్రజెంట్ రాంచరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ ‌‌ మూవీలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఈ క్రమంలో అంజలి పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయిందని పుకార్లు జోరుగా వినిపించాయి. తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషన్స్ లో పాల్గొన్న అంజలీ తన పెళ్లిపై ఆసక్తికర విషయాలను వెల్లడించింది.” ఇప్పటికీ నా పెళ్లి వార్తలు వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో నాకు మూడు నాలుగు సార్లు పెళ్లిళ్లు అయినట్లు రూమర్స్ వచ్చాయి.

ఒకప్పుడు అవి చూసిన ఫ్యామిలీ వాళ్ళు కంగారు పడేవాళ్లు. కానీ ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదు. ఈమధ్య ఓ వ్యాపారవేత్తతో నా పెళ్లి జరిగినట్లు పుకార్లు వచ్చింది. దీంతో ఈ విషయం మా అక్కకి తెలిసి ఫోన్ చేసి మరి పెళ్లి చేసుకున్నావ్ అంట కదా అని అడిగింది. నేను ఏమో మరి నాకు తెలీదు అని చెప్పాను. ఆ రూమర్స్ వాళ్ళ పరిస్థితి ఎలా అయ్యిందంటే.. నేను ఓ అబ్బాయిని ఇంటికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటా అన్న ఇంట్లో వాళ్ళు నమ్మేలాగా లేరు ” అంటూ వెల్లడించింది ఈ బ్యూటీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు