Ram Charan : చంద్రబాబు ప్రమాణస్వీకార వేడుకకు గ్లోబల్ స్టార్..

Ram Charan : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడగా, ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ భారీ మెజార్టీ తో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఆ పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు రేపు ( జూన్12) న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ కార్యక్రమం కోసం కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్‌ వద్ద ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఇక ఈ బుధవారం ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనునున్నారు. అలాగే పలువురు ఎమ్మెల్యేలు, వివిధ కెబినెట్ లలో మంత్రులుగానూ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక ఈ ప్రతిష్టాత్మక వేడుకకి తెలుగు రాష్ట్రాలలో పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు చలన చిత్ర పరిశ్రమ నుంచి కొందరు ప్రముఖులు వెళ్లనున్నారు. ఇక ఈ వేడుకకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూడా వెళ్లనున్నాడని తాజాగా సమాచారం వచ్చింది.

Global star Ram Charan for Chandrababu Naidu's swearing-in ceremony

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రామ్ చరణ్!

ఇక తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనుండగా, ఆయన కుప్పం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. అలాగే నందమూరి తారక రామారావు తనయుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ హిందూపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ కొట్టి, మూడోసారి అక్కడ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో ఆయన తప్పకుండా ఉంటారు. అలాగే పిఠాపురం శాసనసభ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా పోటీ చేశాయి కనుక ఆయన కూడా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అతిథుల జాబితాలో తప్పకుండా ఉంటారు. ఇక రాజకీయ నేపథ్యం ఉన్న సినీ హీరోలు పవన్ కళ్యాణ్, బాలకృష్ణను మినహాయిస్తే… తెలుగు చిత్రసీమలో కొందరు హీరోలకు ఆహ్వానాలు అందాయి. వారిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉన్నారు. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ చిత్రీకరణ చేస్తూ చరణ్ ఏపీలో ఉన్నారు. ఆ షూటింగ్ నుంచి చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం ఒక్క రోజు గ్యాప్ తీసుకోనున్నారు. అలాగే టీడీపీ మద్దతుదారులైన దర్శకులు రాఘవేంద్ర రావు, సీనియర్ హీరో మురళీమోహన్, నిర్మాత అశ్వనీదత్ తదితరులు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయట.

- Advertisement -

ప్రధాని మోడీతో ముఖ్య అతిథి..

ఇక చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొందరు, కేంద్రంలో నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు సైతం హాజరు కానున్నారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు రానున్న నేపథ్యంలో అధికారులు సెక్యూరిటీ విషయంలో మరిన్ని జాగ్రత్తలు వహిస్తున్నారు. ఇక గన్నవరంలో 14 ఎకరాల స్థలంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం ప్రత్యేక ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. వర్షాలు కురిసినా ఇబ్బంది లేకుండా అల్యూమినియంతో షెడ్లు వేశారట. వీఐపీల కోసం ఎయిర్ పోర్టు నుంచి సభా ప్రాంగణం వరకు ప్రత్యేక దారి ఏర్పాటు చేశారని సమాచారం. అలాగే అథితులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయవాడలో స్టార్ హోటళ్లలో గదులను బుక్‌ చేశారు. సుమారు 10 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు