GOAT CENSORED : పొరపాటున సినిమా తేడా కొడితే, మంచి ట్రోలింగ్ స్టఫ్ అవుతుంది

GOAT CENSORED :తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న మల్టీ టాలెంటెడ్ దర్శకులలో వెంకట ప్రభు(Venkat Prabhu) ఒకరు. కేవలం ప్లే బ్యాక్ సింగర్ గా, నటుడుగానే కాకుండా దర్శకుడుగా కూడా తనకంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సాధించుకొని, మంచి గుర్తింపును పొందుకున్నాడు. వెంకట ప్రభు 2007లో రిలీజ్ అయిన “చెన్నై 60028” అనే సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత చేసిన సరోజ, గోవా, మంకంద, బిర్యాని, మానాడు వంటి చిత్రాలతో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు వెంకట్ ప్రభు.

ప్రస్తుతం వెంకట్ ప్రభు విజయ్ తో ది గ్రేటెస్ట్ ఆల్ టైం(Goat) అనే సినిమాని చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. తలపతి విజయ్ రీసెంట్ గా నటించిన లియో సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కూడా రాబట్టుకుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కాబట్టి ఈ సినిమా పైన అద్భుతమైన అంచనాలు ఉన్నాయి. ఈ రీసెంట్ గానే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ బాగా ట్రోల్ అయింది. అలానే తమిళ్ ట్రైలర్ కూడా కొంతమేరకు ట్రోలింగ్ గురి అయింది.

GOAT

- Advertisement -

ఇక లేటెస్ట్ గా తెలుగు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. మామూలుగా తెలుగు ప్రేక్షకులు ఏ సినిమా వచ్చినా విపరీతంగా ఆదరిస్తారు. అలా విజయ్ చేసిన ఎన్నో సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఇకపోతే విజయ్(Vijay) చేస్తున్న గోట్ మూవీ తెలుగు ట్రైలర్ కొంతమేరకు బాగానే ఉన్నా కూడా, కొన్ని విజయ్ ఎక్స్ప్రెషన్స్ నవ్వు తెప్పిస్తున్నాయి. అలానే కొన్ని విజువల్స్ అయితే మరీ పేలవంగా ఉన్నాయి. ఇంకా ఓపెన్ గా చెప్పాలి అంటే సినిమా మీద ఉన్న ఆసక్తిని కూడా ఈ ట్రైలర్ తగ్గించేలా ఉంది. గ్రాఫిక్స్ లో విజయం చూపించిన విధానం అసలు సెట్ కాలేదు. కానీ దర్శకుడు వెంకట్ ప్రభు మీద కొంతమేరకు నమ్మకాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ చాలా ట్రోల్ కి గురి అయింది అని అనుకుంటే, ఈ సినిమా కంప్లీట్ వెర్షన్ దాదాపు మూడు గంటల పాటు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అయితే పర్వాలేదు గాని పొరపాటున తేడా కొట్టింది అని అంటే మంచి ట్రోలింగ్ కంటెంట్ వస్తుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు