Telugu Movies : దైవం సినిమా రూపేణా… ఆ పాత ట్రెండ్ మళ్లీ

Telugu Movies : సినిమాల్లో రారాజు అని చెప్పుకునే మాయాబజర్‌ ను అందరూ చూసి ఉంటారు. ఈ సినిమాలో క్లైమాక్స్‌లో ఓ సీన్ ఉంటుంది. ఘటోత్కచుడు ఇంట్లో శశిరేకా పరిణయం అయ్యాకా… ఘటోత్కచుడు ఇంటికి బలరాముడు, శ్రీ క్రుష్ణుడు వచ్చిన తర్వాత… అప్పుడు జరిగిన పరిణామల గురించి చర్చిస్తారు. అప్పుడు ఇదింతా.. శ్రీ క్రుష్ణుడి లీలా అంటూ ఘటోత్కచుడు… “జై సత్య సంకల్ప జై శేషతల్పా…” అంటూ ఓ పద్యం పాడుతాడు. అప్పుడు శ్రీ క్రుష్ణుడు విశ్వరూపం కనిపిస్తుంది. అప్పటి వరకు కొంత కామెడీగా సాగిన సినిమాను ఎంజాయ్ చేసిన ఆడియన్స్ ఒక్కసారిగా భక్తి పరవశంలోకి వెళ్తారు.

ఈ ట్రెండ్ మళ్లీ సినిమాల్లో కనిపిస్తుంది. మాయాబజర్ తర్వాత కొన్ని సినిమాల్లో ట్రై చేసినా, అవి పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. కానీ, ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాల్లో మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది.

కాంతార సినిమా చూశారా… సినిమా స్టార్టింగ్‌లో చిన్నగా ఓ పాయింట్ చూపించి.. సినిమా మొత్తం ఏదో ఒక కథతో నడిపించి… క్లైమాక్స్‌లో దేవుడిని తీసుకొచ్చి ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించారు.

- Advertisement -

హనుమాన్ సినిమా చూశారా… ఈ సినిమా స్టార్టింగ్‌లో కూడా మంచు కొండల్లో హనుమాన్ చూపించి… డైరెక్ట్‌గా స్టోరీలోకి తీసుకెళ్తారు. ఇక క్లైమాక్స్‌లో హనుమాన్ ను తీసుకొచ్చి పూనకాలతో ఊగిపోయాలా చేశారు.

రీసెంట్‌గా కల్కి… సినిమా స్టార్ట్ చేయడమే కురుక్షేత్రం.. తర్వాత కథ… ఎప్పటి లాగే.. ఆడియన్స్‌ను ఊగేలా చేసే క్లైమాక్స్.

ఇప్పుడు మళ్లీ ఈ ఫార్ములను దర్శక నిర్మాతలు నమ్ముకుంటున్నారు. పైన చెప్పిన కాంతార, హనుమాన్, కల్కి ఈ మూడు సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. ఈ మూడు సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటంటే… క్లైమాక్స్ మినహా సినిమాలో చాలా వరకు బోరింగ్ సీన్స్ ఉంటాయి. ఇప్పుడు 600 కోట్లు కొల్లగొట్టి.. 1000 కోట్ల వైపునకు దూసుకెళ్తున్న కల్కి సినిమాలో కూడా బోరింగ్ సన్నివేశాలు ఎక్కువే. కానీ, ఇప్పుడు ఈ 600 కోట్లు వచ్చాయంటే… రేపు 1000 కోట్ల క్లబ్‌లో చేరబోతుంది అని ఇంత కాన్ఫిడెంట్‌గా చెబుతున్నామంటే.. కారణం క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ లో దేవుళ్లను తీసుకురావడం.

Gods in movies... like Kantara, Hanuman, Kalki
Sri krisna in Kalki Movie

కల్కి మాత్రమే కాదు… పైన చెప్పిన రెండు సినిమాలు కాంతార, హనుమాన్ కూడా అంతే. కేవలం దేవుడు పేరుతోనే హిట్ అయ్యాయి. అన్ని కోట్ల కలెక్షన్లు తెచ్చి పెట్టాయి. ఆడియన్స్ నుంచి నిర్మాతల చేతుల్లోకి కోట్ల రూపాయలు ట్రాన్స్‌ఫర్ అయ్యేలా చేశాయి. ఆడియన్స్ ఫల్స్ పట్టుకున్న దర్శక నిర్మాతలు… ఇదే టాపిక్‌తో మరిన్ని సినిమాలు కూడా చెయొచ్చు.

గతంలో రైతులపైన సినిమాలు చేసి హిట్ కొట్టిన డైరెక్టర్లు, నిర్మాతలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దేవుళ్లపై సినిమాలు చేసి డైరెక్టర్లు హిట్లు, నిర్మాతల జేబులు నింపుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు