Golden Visa: సెలబ్రిటీలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసా..?

Golden Visa.. ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు గోల్డెన్ వీసా. చాలామంది సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు ఈ గోల్డెన్ వీసాను అందుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తున్నారు. అసలు ఏంటీ గోల్డెన్ వీసా? సెలెబ్రెటీలకు దీని వల్ల ఉపయోగం ఏమిటి ?అసలు ఇది ఎవరికి ఇస్తారు? ఎందుకు ఇస్తారు ..? అనే సందేహాలు అటు నెటిజన్స్ లోనే కాదు ఇటు ప్రజలలో కూడా వ్యక్తం అవుతున్నాయి..

చిరంజీవితో సహా గోల్డెన్ వీసా అందుకున్న సెలబ్రిటీలు..

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా తాజాగా దుబాయ్ గోల్డెన్ వీసాను అందుకున్నారు.. వివిధ రంగాలలో విశేష సేవలు అందించే ప్రముఖులకు దుబాయ్ ప్రభుత్వం ఈ వీసాను అందిస్తుంది. ఈ క్రమంలోనే చిరంజీవికి ఈ అరుదైన గౌరవం దక్కడంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉండగా చిరు కంటే ముందే మన దేశం నుంచి పలువురు ప్రముఖులకు ఈ గోల్డెన్ వీసా లభించింది.. ముఖ్యంగా రామ్ చరణ్ సతీమణి ఉపాసనతో పాటు రజనీకాంత్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. ఇంతకీ ఈ గోల్డెన్ వీసా అంటే ఏమిటి? ఈ వీసా వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

గోల్డెన్ వీసా ఉపయోగాలు..

Golden Visa: Do you know how it is useful for celebrities..?
Golden Visa: Do you know how it is useful for celebrities..?

దుబాయ్ అంటేనే బంగారం మరియు షాపింగ్.. అలాగే పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్.. అందుకే ప్రపంచ దేశాలకు చెందిన ధనవంతులు ఈ దుబాయ్ ని సందర్శించడానికి క్యూ కడుతూ ఉంటారు.. అక్కడ నివాసం, వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసుకుంటున్నారు.. ఇలాంటి వారి కోసమే దుబాయ్ ప్రభుత్వం ఒక అవకాశాన్ని తీసుకొచ్చింది.. దుబాయిలో సొంత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి యూఏఈ తీసుకొచ్చిన కొత్త విధానమే ఈ గోల్డెన్ వీసా.. 2019 నుంచి దుబాయ్ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది.

- Advertisement -

శాశ్వత నివాసంతో పాటు వ్యాపారానికి కూడా..

ముఖ్యంగా ఇతర దేశాలకు సంబంధించిన వారు దుబాయ్ లో దీర్ఘకాలికంగా నివసించే అవకాశం లభిస్తుంది. 10 సంవత్సరాల కాల పరిమితితో ఉండే ఈ వీసా ఆటోమేటిక్ గా రెన్యూవల్ అవుతుంది. అంతేకాదు సొంతంగా వ్యాపారాలు చేసుకోవడానికి కూడా వీలు ఉంటుంది..

గోల్డెన్ వీసా దారుడు మరణిస్తే కుటుంబానికి ఉపయోగాలు..

ఎవరైతే ఈ గోల్డెన్ వీసాను పొంది ఉంటారో.. ఆ వ్యక్తి మరణిస్తే.. తదనంతరం ఆ వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు దుబాయ్ లో నివసించడానికి అవకాశం కల్పించబడింది.

గోల్డెన్ వీసాతో సులభంగా డ్రైవింగ్ లైసెన్స్..

వీటితోపాటు తమ సొంత దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న గోల్డెన్ వీసా దారులు.. యూఏఈ లో కూడా నేరుగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు… ఇందుకోసం దుబాయ్ లోని డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్లో దరఖాస్తు చేసుకొని రెండు పరీక్షలలో ఉత్తీర్ణులు అయితే చాలు.. వారికి అక్కడ లైసెన్స్ లభిస్తుంది..

స్పాన్సర్ అవసరం లేదు..

ఇక దుబాయ్ లో వీసా పొందాలి అంటే స్పాన్సర్ లేదా యజమాని యొక్క అవసరం ఉంటుంది.. కానీ గోల్డెన్ వీసా ఉన్నవారికి అటువంటి అవసరం లేదు

6 నెలల కంటే ఎక్కువ కాలం దుబాయ్ లో లేకున్నా నో ప్రాబ్లం..

అలాగే గోల్డెన్ వీసా ఉన్నవారు ఆరు నెలల కంటే ఎక్కువ కాలం దుబాయ్ బయట నివాసం ఉన్నా సరే వీసా రద్దు కాదు..

బీమా పాలసీలకి కూడా అర్హులు..

ముఖ్యంగా గోల్డెన్ వీసా ఉన్నవారు దుబాయిలో అమల్లో ఉన్న ప్రత్యేక బీమా పాలసీలకు కూడా అర్హులవుతారు

కుటుంబ సభ్యులను స్పాన్సర్ చేయవచ్చు..

పైగా గోల్డెన్ వీసా ఉన్నవారు వారి కుటుంబ సభ్యులను సైతం స్పాన్సర్ చేసుకునే వీలు కల్పించబడింది.. వీరు స్పాన్సర్ చేసే గృహ కార్మికుల పైన ఎటువంటి పరిమితి కూడా ఉండదు..

ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ఈ గోల్డెన్ వీసా అత్యంత ప్రత్యేకమే కాదు అరుదైనది అని కూడా చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు