Kalki: ఇది కదా హై అంటే, లార్జెస్ట్ స్క్రీన్ లో గూస్బంస్ మూమెంట్స్

Kalki: ప్రస్తుతం తెలుగు సినిమా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగు ప్రేక్షకులు కు మాత్రమే పరిమితమైన తెలుగు సినిమా గురించి నేడు ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. తెలుగు సినిమా ఈ స్థాయికి వెళ్లడానికి ఎస్ఎస్ రాజమౌళి కీలకపాత్రను పోషించారు. ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తర్వాత నుంచి చాలామంది తెలుగు సినిమా వైపు చూడటం మొదలుపెట్టారు. ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్, సుకుమార్ పుష్ప సినిమాలు తెలుగు సినిమాని మరింత ముందుకు తీసుకెళ్లాయి.

ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాకి ఆస్కార్ కూడా వచ్చేలా చేసింది. ఇకపోతే రాజమౌళి చేసిన వర్క్ కి ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఫిదా అయిపోయారు. ప్రపంచంలోనే లార్జెస్ట్ స్క్రీన్ అయిన చైనీస్ థియేటర్లో ఈ సినిమాను ప్రదర్శించారు. అక్కడ రాజమౌళి కూడా ఈ ప్రదర్శనలో పాల్గొని అక్కడి ఆడియన్స్ తో ముచ్చటించారు. వాస్తవానికి ఆస్కార్ వరకు ప్రయాణం అక్కడి నుంచే మొదలైంది అని చెప్పొచ్చు.

Kalki

- Advertisement -

ఇక ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా కల్కి సినిమా టాపిక్ నడుస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి సినిమా కాసుల వర్షం కురిపిస్తుంది. మైథిలాజికల్ సైన్స్ ఫిక్షన్ జోనర్ వచ్చిన ఈ సినిమా అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి చూపించింది. ఇకపోతే ఈ సినిమాని చైనీస్ థియేటర్లో జులై 13న ప్రదర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్ గా పేరు సాధించిన ఈ థియేటర్లో కల్కి సినిమాను చూసి ప్రపంచ ఆడియన్స్ అంతా షాక్ అయ్యారు. చాలామందికి ఈ సినిమా మంచి హై ఇచ్చింది. ఈ సినిమా అయిపోయిన అనంతరం చాలామంది లేచి స్టాండింగ్ ఓవేసన్ ఇచ్చారు. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత మళ్లీ ఈ సినిమాకి ఇలా జరగడం తెలుగు సినిమా సాధించిన ఘనత అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు