SDGM : బాలీవుడ్ ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన గోపీచంద్..

SDGM : టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాంచి ఊపు మీదున్నాడు. లాస్ట్ ఇయర్ వీర సింహారెడ్డి సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న గోపీచంద్ ఆ తర్వాత రవితేజ తో సినిమా చేయాల్సి ఉండగా, ఆ సినిమా క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్ట్ ని బాలీవుడ్ హీరోతో అనౌన్స్ చేసి అందరికి షాకిచ్చాడు. బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ తో గోపీచంద్ మలినేని తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక గత కొన్నేళ్లుగా ఫామ్ లో లేని సన్నీ డియోల్ (Sunny deol) లాస్ట్ ఇయర్ గదర్2 సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక గోపీచంద్ – సన్నీ డియోల్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాను బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా SDGM సినిమా నుండి తాజాగా మరో క్రేజీ అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు.

Gopichand Malineni gave a crazy update on the SDGM project

మాస్ ఫీస్ట్ లోడింగ్..

బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ తో – గోపీచంద్ మలినేనితో (Gopichand malineni) రీసెంట్ గానే షూటింగ్ కూడా మొదలు పెట్టేసాడు. అనౌన్స్ చేసినపుడే ఇండియాస్ బిగ్గెస్ట్ మాస్ కాంబో అంటూ మేకర్స్ తెలియచేయగా, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఇంకా టైటిల్ నిశ్చయించని ఈ సినిమా గురించి దర్శకుడు గోపీచంద్ మలినేని తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాకి సంబంధించి యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్న గోపీచంద్ మలినేని దాని గురించి అప్డేట్ అందించాడు. ప్రముఖ స్టంట్ మాస్టర్ ‘పీటర్ హెయిన్’ (Peter Hein) తో ఒక ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్ ని డిజైన్ చేస్తున్నట్టుగా.. స్టిల్స్ పెట్టి “మాస్ ఫీస్ట్ లోడింగ్” అంటూ ట్వీట్ చేసాడు.

- Advertisement -

 

నెక్స్ట్ ఇయర్ ప్రేక్షకుల ముందుకు సినిమా..

ఇక ఈ సినిమాలో రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ రణదీప్ హుడా (Ranadeep hooda) నటిస్తునట్టు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించబోతున్నాడు. హిందీలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో గోపీచంద్ మలినేని గ్రాండ్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుండగా, సయామీ ఖేర్ మరియు రెజీనా కసాండ్రా ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించబోతున్నారు. అయితే ఈ సినిమా మాత్రం నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు