Gopichand Malineni : లక్ అంటే నీదే మామ… ఏకంగా బాలీవుడ్‌లో ఛాన్స్ కొట్టేశావ్

Gopichand Malineni : టాలీవుడ్ లో ఉన్న మాస్ డైరెక్టర్లలో గోపీచంద్ మలినేని ఒకరు. బలుపు, క్రాక్, రీసెంట్ గా వీరసింహారెడ్డి వంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఏడాది కింద రవితేజ – గోపీచంద్ మలినేని కాంబో లో నాలుగో సినిమా అనౌన్స్ మెంట్ అయింది. కానీ పలు కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. కానీ అనూహ్యంగా గోపీచంద్ మలినేని సినిమా వేరే హీరోతో అనౌన్స్ మెంట్ జరిగింది. అది కూడా తెలుగు హీరో కాదు ఏకంగా బాలీవుడ్ హీరోతో సినిమా. అవును.. ఈరోజే కాసేపటికిందే అనౌన్స్ మెంట్ అయిన ఈ ప్రాజెక్ట్ ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కబోతుంది. ఇక గోపీచంద్ (Gopichand Malineni) సినిమా చేయబోతున్న బాలీవుడ్ స్టార్ ఎవరో కాదు, రీసెంట్ గా గదర్2 సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన “సన్నీ డియోల్”. కొన్ని రోజుల కిందే గోపీచంద్ బాలీవుడ్ లో సన్నీ డియోల్ కి కథ చెప్పాడని, సన్నీ వెంటనే ఓకే చేశాడని సమాచారం. ఇక అలా ఒకే చేయడమే లేటు. ఇటు సినిమాని అనౌన్స్ చేసేసారు. ఈ అప్డేట్ చూస్తున్న నెటిజన్లు గోపీచంద్ ని లక్ అంటే గోపిదే ఏకంగా బాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేశాడని కితాబిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Gopichand Malineni & Sunny Deol movie SDGM Announcement

SDGM ప్రాజెక్ట్ వివరాలివే…

ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా నటించబోయే సినిమా #SDGM వర్కింగ్ టైటిల్ పేరిట నేడు అధికారికంగా పాన్ ఇండియా సినిమాగా అనౌన్స్ మెంట్ అయింది. ఇక మైత్రీ మూవీ మేకర్స్‌కి సంస్థ అధినేతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్, మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చెందిన టిజి విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించబోతున్నాడు. అయితే ఈ సినిమాను హిందీలో తెరకెక్కించినా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తారని సమాచారం. ఇక ఈ సినిమాతో గోపీచంద్ మలినేని గ్రాండ్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ గత పదిహేనేళ్లగా ఫామ్ లో లేకపోగా, రీసెంట్ గా గదర్ 2 సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు. ఆ సినిమా ఏకంగా బాలీవుడ్ లో టాప్ 5 గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. నిర్మించే స్ట్రెయిట్ హిందీ సినిమా కోసం బ్లాక్‌బస్టర్ మెషిన్ గోపీచంద్ మలినేనితో కలిసి అతను చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నాడు.

- Advertisement -

సినిమా కాస్ట్& క్రూ వివరాలివే…

ఇక గోపీచంద్ మలినేని సన్నీ డియోల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్లుగా సయామీ ఖేర్ మరియు రెజీనా కసాండ్రా నటించబోతున్నారట. అలాగే సాంకేతిక నిపుణుల వివరాలు కూడా తెలపడం జరిగింది. రిషి పంజాబీ కెమెరామెన్ గా వర్క్ చేయనుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.

సహ నిర్మాతలు: బాబా సాయి కుమార్ మామిడిపల్లి, జయ ప్రకాష్ రావు (జేపీ)
యాక్షన్ కొరియోగ్రాఫర్: అన్ల్ అరసు, రామ్ లక్ష్మణ్, వెంకట్
డైలాగ్స్: సౌరభ్ గుప్తా
రచన బృందం: ఎం వివేక్ ఆనంద్, నిమ్మగడ్డ శ్రీకాంత్, శ్రీనివాస్ గవిరెడ్డి, మయూఖ్ ఆదిత్య కృష్ణ
కాస్ట్యూమ్ డిజైనర్లు: భాస్కీ (హీరో), రాజేష్ కమర్సు
పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న
VFX: దక్కన్ డ్రీమ్స్
PRO: వంశీ-శేఖర్

ఇదిలా ఉండగా గోపీచంద్ మలినేని రవితేజ తో చేయాల్సిన సినిమానే సన్నీ డియోల్ తో చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ న్యూస్ లో నిజమెంతో చిత్ర యూనిట్ నుండే క్లారిటీ రావాలి. ఇక ఈ సినిమా జూన్ 22 నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు