Gorre Puranam: క్రేజీ ప్రోమోషన్స్, వాట్సప్ ఫార్వర్డ్ మెసేజెస్ ఇన్స్పిరేషన్.?

Gorre Puranam: ఒక మంచి కాన్సెప్ట్ సినిమాను తీయడం ఎంత ముఖ్యమో అలానే ఆ సినిమాను ప్రేక్షకులు వద్దకు చేరేలా చేయడం కూడా అంతే ముఖ్యం. చాలా సినిమాలు ప్రేక్షకుల వరకు చేరకుండా ఉండిపోతాయి. దీనికి పలు రకాల కారణాలు ఉండొచ్చు. అయితే ఒక సినిమాను ప్రమోట్ చేయడంలోనే దాని రీచ్ ఉంటుంది. అందుకోసమే సినిమా మేకింగ్ మీద ఎంత ఆసక్తిని చూపిస్తారో సినిమాకి సంబంధించిన పబ్లిసిటీ మీద కూడా అంతే ఆసక్తిని చూపించి క్రేజీగా ఆ సినిమాను జనాల ముందుకు తీసుకెళ్లే ప్లాన్ చేస్తుంటారు కొన్ని చిత్ర యూనిట్స్.

ఇక సుహస్ నటించిన గొర్రె పురాణం(Gorre Puranam) చిత్ర యూనిట్ కూడా ఇదే మాదిరిగా సినిమాను ప్రమోట్ చేయడం మొదలుపెట్టింది.”ఈ సినిమా విడుదల తేదీని ఐదుగురితో చెప్పు. లేకపోతే దరిద్రం నిన్ను వెంటాడుతుంది” అంటూ ఈ సినిమా పోస్టర్ పైన రాసారు. ఇకపోతే ఇలాంటి మెసేజెస్ అన్నీ కూడా మనకు వాట్సాప్ లో కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది వీటిని షేర్ చేసుకోవటమే పనిగా పెట్టుకుంటారు. వాళ్ళని కొంతమంది వాట్స్అప్ అంకుల్స్ అని కూడా అంటారు. ఇకపోతే ఈ సినిమా పోస్టర్ చాలా ఆసక్తికరంగా అనిపించింది. దీని ద్వారా ట్రోల్ చేయడానికి అయినా కూడా ఈ సినిమా పోస్టర్ ను షేర్ చేస్తారు. ఖచ్చితంగా రిలీజ్ డేట్ చాలా మందికి చేరుతుంది.

హీరో సుహాస్(Suhas) విషయానికి వస్తే ముందుగా సినిమాల్లో కొన్ని పాత్రల్లో కనిపిస్తూ, కలర్ ఫొటో(Colour Photo) సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఓటీటిలో రిలీజ్ అయిన ఈ సినిమా విపరీతమైన రెస్పాన్స్ ను సాధించుకుంది. ఆ తర్వాత చేసిన రైటర్ పద్మభూషణ్(Writer Padmabhusan) సినిమా మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక సుహాస్ హీరోగా వచ్చిన లాస్ట్ ఫిలిం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతోపాటు మంచి ప్రశంసలను కూడా పొందుతుంది. ఇప్పటివరకు సుహాస్ చేసిన ప్రతి సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

- Advertisement -

Gorre Puranam

ప్రస్తుతం గొర్రె పురాణం సినిమాలో సుహాస్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు.ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కూడా మంచి ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమాకు బాబీ(Bobby) దర్శకత్వం వహిస్తున్నాడు. లవ్ స్టోరీ(Love Story) సినిమాతో సంగీత దర్శకుడుగా పరిచయమైన పవన్ సిహెచ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు