Nagarjuna: నాగార్జున హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది….?

 

Nagarjuna:  టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో నాగార్జున గురించి ప్రత్యేకంగా అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మన్మధుడిగా తనకంటూ మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. నాగార్జున నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో సంతోషం సినిమా ఒకటి.

ఈ సినిమా పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో నాగార్జున సరసన శ్రియ, గ్రేసీ సింగ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో గ్రేసీ సింగ్ కనిపించింది చాలా తక్కువ సమయం. అయినప్పటికీ తన అందం, నటన, అభినయంతో ప్రతి ఒక్కరికి ఆకట్టుకుంది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న గ్రేసి ఆ సినిమా అనంతరం ఎన్నో సినిమా అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు.

- Advertisement -

Gracy Singh Age, Boyfriend, Husband, Family, Biography & More » StarsUnfolded

కానీ ఈ సినిమా అనంతరం పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. మోహన్ బాబు, శ్రీకాంత్ హీరోలుగా నటించిన…. తప్పుచేసి పప్పుకూడు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ఏ ఒక్క తెలుగు సినిమాల్లో నటించలేదు. హిందీ, తమిళ్, పంజాబీ, మలయాళం తదితర భాష చిత్రాల్లో నటించింది. బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Gracy Singh - Best Movies, TV Shows, Career, Age, Birthday, Net Worth

చాలాకాలం తర్వాత రామ రామ కృష్ణ కృష్ణ అనే సినిమాలో ఓ కీలకపాత్రలో కనిపించింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ వయసు 43 ఏళ్లు అయినప్పటికీ ఇంకా వివాహం చేసుకోలేదు. తన స్వతహాగా భరతనాట్యం డాన్సర్ అయిన గ్రేసీ సింగ్ తన పేరుతో “గ్రేసీ సింగ్ డ్యాన్స్ ట్రూప్”ని ప్రారంభించింది. దేశ విదేశాల్లో నృత్య ప్రదర్శనలు చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు