Guruvayur Ambalanadayil : వంద కోట్ల దిశగా పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమా.. ఇది మామూలు ఊపు కాదు!

Guruvayur Ambalanadayil : మలయాళం ఇండస్ట్రీ నుండి ఈ ఏడాది వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా హీరోతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు హిట్ చేసి పడేస్తున్నారు మేకర్స్. ఇక ఈ ఏడాది భ్రమయుగం, మంజుమ్మేల్ బాయ్స్, ప్రేమలు, ఆడు జీవితం, ఆవేశం వంటి సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. పైగా ఇందులో మూడు సినిమాలు 150 కోట్లకి పైగా వసూళ్లు సాధించగా, మంజుమ్మేల్ బాయ్స్ ఏకంగా 210 కోట్లకి పైగా కొల్లగొట్టి ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఈ సినిమాలో స్టార్ నటులు ఎవరూ లేకపోయినా లాంగ్ రన్ లో అద్భుతమైన కలెక్షన్లు సాధించి విజయం సాధించింది. ఇక తాజాగా మలయాళం నుండి మరో హిట్ సినిమా వచ్చి, రికార్డు కలెక్షన్లు సాధిస్తుంది.

Guruvayur Ambalanadayil movie heading towards 100 crores mark

భారీ కలెక్షన్లు రాబడుతున్న గురువాయూర్ అంబలనాదయిల్…

ఇక రీసెంట్ గా ఆడు జీవితం వంటి ప్రయోగాత్మక సినిమాతో అదిరిపోయే హిట్ కొట్టిన పృత్వి రాజ్ సుకుమారన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ “ది గోట్ లైఫ్” సినిమా తర్వాత “గురువాయూర్ అంబలనాదయిల్” మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుని కలెక్షన్లను సాధిస్తుంది. ఇక ఈ రెండు సినిమాలతో పృత్వి రాజ్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించారని చెప్పొచ్చు. ఇక మొదటిది ప్రయోగాత్మక చిత్రంగా వచ్చిన ఆడు జీవితం కాగా, రెండోది కమర్షియల్ అంశాలతో కూడిన వినోదాత్మక చిత్రం. ఇక “గురువాయూర్ అంబలనాదయిల్” సినిమా అన్ని అంచనాలను అధిగమించింది. ట్రేడ్ పండితులను కూడా షాక్ కి గురి చేస్తూ టికెట్ విండోల వద్ద ఊహించలేని విధంగా వసూళ్లను రాబడుతోంది. జయ జయ జయ జయ హే, ఫేమ్ విపిన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ డ్రామా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల మార్కును దాటింది.

- Advertisement -

వంద కోట్ల దిశగా..

ఇక గురువాయూర్ అంబలనాదయిల్ (Guruvayur Ambalanadayil) సినిమా ఇప్పటికి థియేటర్లలో భారీ కలెక్షన్లు రాబడుతుంది. ఇక మొదటి సోమవారం వర్కింగ్ డే లో కూడా 3 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ఇప్పటి వరకు కేరళలో 20 కోట్లకు పైగా వసూలు చేసింది. గురువాయూర్ అంబలనాదయిల్ అంతర్జాతీయ మార్కెట్‌లలో అద్భుతమైన రన్ సాధిస్తోంది. ఇక త్వరలో మలయాళ చిత్ర పరిశ్రమకు ఇది మరో 100 కోట్ల గ్రాసర్‌గా నిలిచే అవకాశం ఉంది. ఇక పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ మరియు E4 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లు నిర్మించిన ఈ చిత్రంలో బాసిల్ జోసెఫ్, నిఖిలా విమల్, అనశ్వర రాజన్, సిజు సన్నీ మరియు యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. అంకిత్ మీనన్ స్వరాలు సమకూర్చారు. ఇక ఈ సినిమాతో మరో హిట్ కొట్టిన పృత్వి రాజ్ కుమార్ త్వరలో మోహన్ లాల్ తో ఓ సినిమా చేయనున్నారు. అలాగే త్వరలో ప్రభాస్ తో సలార్ 2 లో కూడా నటించనున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు