Hamare Baarah : వివాదాస్పద మూవీకి కోర్టు గ్రీన్ సిగ్నల్… కానీ ఒక్క కండిషన్

Hamare Baarah : ఇటీవల కాలంలో తీవ్ర దుమారం రేపిన హమారే బరాహ్ మూవీ రిలీజ్ కు తాజాగా కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇన్ని రోజులూ వివాదాల కారణంగా ఆగిపోయిన ఈ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. కానీ ఒక్క కండిషన్ మీద. అదేంటో తెలుసుకుందాం పదండి.

మూవీ రిలీజ్ చేయాలంటే ఇదే కండిషన్…

అన్నూ కపూర్ నటించిన హమారే బరాహ్ చిత్రాన్ని విడుదల చేసేందుకు బాంబే హైకోర్టు అనుమతించింది. ‘అభ్యంతరకరమైన’ భాగాలను తొలగించడానికి మేకర్స్ అంగీకరించిన తర్వాత జూన్ 21న సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి కోర్టు అనుమతించిందని తాజా సమాచారం. ఈ చిత్రం ముస్లిం సమాజం మనోభావాలను దెబ్బతీయదని, మహిళల అభ్యున్నతి గురించి ఉందని పేర్కొన్న జస్టిస్ బిపి కొలబవల్లా, జస్టిస్ ఫిర్దోష్ పూనివాలాలతో కూడిన డివిజన్ బెంచ్ ఒక రోజు తర్వాత కండిషన్ పై మూవీని రిలీజ్ చేసుకోవచ్చు అంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ చిత్రం తొలి ట్రైలర్‌ అభ్యంతరకరంగా ఉన్నప్పటికీ దాన్ని తొలగించినట్లు మంగళవారం కోర్టు తెలిపింది. సినిమాలోని అన్ని అభ్యంతరకర సన్నివేశాలను కూడా తొలగించినట్లు తెలుస్తోంది. ‘‘నిజానికి ఈ సినిమా మహిళల అభ్యున్నతికి సంబంధించినది. సినిమాలో ఒక మౌలానా ఖురాన్‌ను తప్పుగా అన్వయించారు. సీన్ లో ఒక ముస్లిం వ్యక్తి దాన్నే ఆబ్జెక్ట్ చేశారు. కాబట్టి ప్రజలు తమ మనస్సును కంట్రోల్ లో పెట్టుకోవాలని, అలాంటి మౌలానాలను గుడ్డిగా అనుసరించకూడదని ఇది చూపిస్తుంది” అని హైకోర్టు పేర్కొంది.

- Advertisement -

Hamare Baarah' teaser sparks social media debate: Netizens divided - The Statesman

వివాదం ఏంటంటే?

మొదట జూన్ 7న హమారే బరాహ్ థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే ఈ సినిమాపై నిషేధం విధించాలని కోరుతూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అన్నూ కపూర్ సినిమా ముస్లిం సమాజాన్ని కించపరిచేలా ఉందని, ఖురాన్ చెప్పిన వాటిని వక్రీకరించారని ఆ పిటిషన్‌లు పేర్కొన్నాయి. హైకోర్టు సినిమా విడుదలను వాయిదా వేయగా, సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నిర్దేశించిన అభ్యంతరకరమైన భాగాలను తొలగించడానికి మేకర్స్ అంగీకరించడంతో జూన్ 14న విడుదలకు అనుమతినిచ్చింది.

కానీ పిటిషనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీం కోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది. హైకోర్టులో పిటిషన్‌ను పరిష్కరించే వరకు సినిమా రిలీజ్ ను తాత్కాలికంగా నిలిపివేయాలి అని ధర్మాసనం ఆదేశించింది.

బ్యాన్మ్ ప్రాణహాని బెదిరింపులు

హమారే బరాహ్ మూవీని ప్రకటించినప్పటి నుండి అన్నూ కపూర్, మనోజ్ జోషి, పరితోష్ త్రిపాఠి నటించిన హమారే బరాహ్ సినిమా ట్రైలర్‌లో అసభ్యకరమైన, మతపరమైన ప్రచారం ఉందని పలువురు ఆరోపించారు. మరికొందరు హమారే బరాహ్ ట్రైలర్ కలవరపెడుతుందని, ఇది మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉందని వాదించారు. ట్రైలర్ విడుదల అయ్యాక ఏకంగా సినిమాలో నటించిన నటీనటులకు చంపుతామనే బెదిరింపులు ఎదురయ్యాయి. మరో పక్క బ్యాన్ చేయాలనే డిమాండ్ విన్పించింది. రగులుతున్న వివాదాల మధ్య మే 30న విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ను ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల నుండి తొలగించారు. కర్ణాటకలో కూడా ఈ చిత్రాన్ని నిషేధించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు