Hamara Barah : మూవీ టీంకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం… అక్కడ మూవీపై బ్యాన్

Hamara Baraah : నటుడు అన్నూ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ‘హమారే బరా’ మూవీకి కష్టాలు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నాయి. మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న హిందీ మూవీ ‘హమారే బరా’ నిర్మాతలకు తాజాగా పెద్ద షాక్ తగిలింది. ఇండియాలోనే ఓ రాష్ట్ర ప్రభుత్వం ఈ మూవీని బ్యాన్ చేసి షాక్ ఇచ్చింది.

మూవీని బ్యాన్ చేసిన ప్రభుత్వం

బాంబే హైకోర్టు ఇప్పటికే సినిమా విడుదలపై స్టే విధించింది. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం హమారే బరా సినిమా విడుదలపై నిషేధం విధించింది. కర్ణాటక సినిమా రెగ్యులేషన్ యాక్ట్ 1964లోని సెక్షన్ 15 (1) మరియు 15 (5) ప్రకారం రాష్ట్రంలో ఈ సినిమా ప్రదర్శనను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సినిమా ప్రదర్శించడం వల్ల మత సామరస్యానికి ముప్పు వాటిల్లుతుందనే కారణంతో సినిమాపై నిషేధం విధించారు. కొన్ని మైనారిటీ వర్గాలు సినిమాను విడుదల చేయవద్దని ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. మొత్తానికి ఈ సినిమా విడుదలపై ఏకంగా ఒక రాష్ట్రం బ్యాన్ విధించడం అనేది సంచలనంగా మారింది.

హైకోర్టులో కూడా ఎదురు దెబ్బే

కమల్ చంద్ర దర్శకత్వం వహించిన హమారే బార్హ్ మూవీ టీజర్ విడుదలైనప్పటి నుండి తీవ్ర దుమారం సృష్టిస్తోంది. ఈ చిత్రంలో అను కపూర్, మనోజ్ జోషి, పరితోష్ త్రిపాఠి నటిస్తున్నారు. హమారే బరా చిత్రానికి కమల్ చంద్ర దర్శకత్వం వహించగా, రాజన్ అగర్వాల్ రచించారు. హమారే బరా’ బీరేంద్ర భగత్, రవి ఎస్ గుప్తా, సంజయ్ నాగ్‌పాల్ మరియు షియో బాలక్ సింగ్‌లు కలిసి నిర్మించారు. ఇంతకుముందు ఈ మూవీ టైటిల్ ‘హమ్ దో హమారే బరా’ అని అనౌన్స్ చేశారు. అయితే సెన్సార్ బోర్డు టైటిల్‌ను మార్చింది. ‘హమారే బరా’ జూన్ 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచే మూవీ కష్టాల్లో పడింది.

- Advertisement -

Why Was The Teaser of The Hamara Barah Movie Removed?

మరోవైపు బాంబే హైకోర్టు ఇప్పటికే జూన్ 14 వరకు ఈ మూవీ విడుదలపై స్టే విధించింది. జూన్ 7న సినిమా విడుదల కావాల్సి ఉండగా, బాంబే హైకోర్టు జూన్ 14 వరకు విడుదలపై స్టే విధించింది. తాజాగా కర్ణాటక ప్రభుత్వం ‘హమారే బరా’ సినిమా విడుదలను రెండు వారాల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిషేధించింది. కర్నాటక సినిమా చట్టం, 1964లోని సెక్షన్ల కింద సినిమా విడుదలపై నిషేధం విధించారు.

ట్రైలర్ తోనే నిర్ణయం

హమారా బరా ట్రైలర్‌ను చూసిన తర్వాత అనేక మైనారిటీ సంస్థలు, ప్రతినిధుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా ట్రైలర్‌లో కనిపిస్తున్న కొన్ని డైలాగులపై సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సినిమా విడుదల కష్టాల్లో పడింది.

‘హమారా బారా’ సినిమా కథ ఉత్తరప్రదేశ్‌ నేపథ్యంలో సాగనుంది. జనాభా పెరుగుదల, దాని ప్రభావాలను ఎత్తి చూపనున్నారు. ఈ చిత్రం ప్రకటించినప్పటి నుండి సాహసోపేతమైన కథ, ఆలోచనలను రేకెత్తించే కథనంతో ఈ మూవీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అంతకుముందు సోషల్ మీడియా ద్వారా గుర్తు తెలియని వ్యక్తుల నుండి తమకు హత్య, అత్యాచారం బెదిరింపులు వస్తున్నాయని చిత్ర నిర్మాతలు, సిబ్బంది మే 24న వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు