Scam 2010 Web Series: ‘సహారా’ సుబ్రతా రాయ్ కథతో ‘స్కాం 2010’

Hansal Mehta announces ‘Scam 2010: ఇండస్ట్రీలో అనేక రకాల సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని సినిమాలు రియల్ కథలను బేస్ చేసుకొని వస్తున్నాయి. మరికొన్ని సినిమాలు క్రైమ్ అలాగే మర్డర్స్ నేపథ్యంలో వచ్చి హిట్ కొడుతున్నాయి. మరికొన్ని సినిమాలు కామెడీ జోనర్ లో వచ్చి బంపర్ హిట్ అవుతున్నాయి. అంతేకాకుండా హారర్ సినిమాలు కూడా ఈ మధ్యకాలంలో బాగానే ఆడుతున్నాయి.

ముఖ్యంగా సైబర్ క్రైమ్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు కచ్చితంగా బంపర్ హిట్ అందుకొని తీరుతున్నాయి. అయితే ఫ్యాక్షన్ సినిమాలు మాత్రం ఈ మధ్యకాలంలో ఆడటం లేదు. ఏదో బాలయ్య లాంటి సినిమాలు తప్ప… రామ్, గోపీచంద్ లాంటి హీరోలు చేస్తే పెద్దగా హిట్ కావడం లేదు. ఇలా ఏదో ఒక కథ అంశాన్ని చేసుకొని… ఇండస్ట్రీలో రకరకాల సినిమాలు వచ్చి… తెలుగు ప్రేక్షకులు నే కాకుండా ఇతర చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

భారీ బడ్జెట్ తో వచ్చే సినిమాలు కొన్ని అయితే… మరి కొన్ని సినిమాలు తక్కువ బడ్జెట్ తో వస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలోనే మరో కొత్త వెబ్ సిరీస్ తెరపైకి వచ్చింది. సంచలన ఫిల్మ్ మేకర్ హన్సల్ మెహతా కీలక ప్రకటన చేశారు. తాజాగా కొత్త వెబ్ సిరీస్ ను ప్రకటించారు మెహతా. సహారా ఫౌండర్ సుబ్రతా రాయి కథ ఆధారంగా స్కాం 2010 వెబ్ సిరీస్ తీస్తున్నట్లు ఆయన వెల్లడించారు . గతంలో ఈయన భారత స్టాక్ మార్కెట్లో సంచలనం సృష్టించిన హర్షత్ మెహతా కథ ఆధారంగా… తీసిన స్కాం 1992 సిరీస్ బంపర్ హిట్ అయింది.

- Advertisement -
Hansal Mehta announces ‘Scam 2010

ఆ తర్వాత స్టాంప్ పేపర్స్ మోసాలపై స్కామ్ 2003 సినిమా కూడా తీశారు. ఆ సినిమా కూడా బంపర్ హిట్ అయింది. దీంతో తాజాగా స్కామ్ 2010 చిత్రాన్ని చేస్తున్నట్లు ప్రకటించేశారు మెహతా. తమిళ్ బందోపాధ్యాయ రాసిన సహారా ది అంటోల్డ్ స్టోరీ బుక్ ఆధారంగా ఈ సిరీస్ తీయబోతున్నారు. ది సోనీ లీవ్ ఓటిటి సిరీస్ ను ఆ బ్లౌస్ ఎంటర్టైన్మెంట్… స్టూడియో నెక్స్ట్ నిర్మిస్తున్నాయి. ఇక దీనికి హాన్సల్ మెహతా దర్శకత్వం వహిస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు