Hansika : సినిమా అవకాశాలు లేక ఆ పనికి సిద్దమైన హన్సిక.. ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చూడడానికి అందంగా, బబ్లీగా ఉండే ఈ భామ తన అందంతో ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తుంది. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. హన్సిక 1991 మహారాష్ట్ర రాజధాని ముంబైలోని సింధి ప్రాంతానికి చెందిన కుటుంబంలో జన్మించింది. హన్సిక తండ్రి ప్రదీప్ మోత్వాని, ఒక ప్రముఖ వ్యాపారవేత్త.

తల్లి మోనా మోత్వాని, డెర్మటాలజిస్ట్. ఈ బ్యూటీ పుట్టి పెరిగింది ముంబైలోనే. తన చదువు అంతా కూడా ముంబైలోనే పూర్తి చేసుకొని షకలక బూమ్ బూమ్ అనే సీరియల్ లో తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత దేస్ మే నిక్లా హోగా చంద్ అనే సీరియల్ లో నటించి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశాలను అందుకుంది. హవా, కోయి… మిల్ గయా, జాగో హమ్ కౌన్ హై?, అబ్ర కా దాబ్ర అనే హిందీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాలో హీరోయిన్గా అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో తన నటనకుగాను ఎన్నో అవార్డులను సైతం అందుకుంది. ఆ సినిమా అనంతరం వరుసగా సినిమా అవకాశాలను అందుకుంది ఈ బ్యూటీ.

- Advertisement -

ఎన్టీఆర్, రామ్ వంటి హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సోహైల్ అనే వ్యక్తిని 2022 డిసెంబర్ లో వివాహం చేసుకుంది. వివాహ అనంతరం ఈ బ్యూటీ గ్లామర్ షోతో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. అనంతరం ఈ బ్యూటీ సినిమా అవకాశాల కోసం తెగ ప్రయత్నాలు చేస్తుందట. వివాహమైనప్పటికీ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేందుకు కూడా రెడీ అవుతోందని టాక్ వినిపిస్తోంది. రెమ్యునరేషన్ తో సంబంధం లేకుండా మంచి కథలు వాతే చేసేందుకు రెడీ ఐంది.  ఈ విషయం తెలిసిన హన్సిక అభిమానులు షాక్ అవుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు