Hansika : ‘ఎప్ప‌టికి ప్రేమిస్తూనే ఉంటా’

పూరిజగ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన ‘దేశ‌ముదురు’ సినిమాతో  తెలుగు తెరకు ప‌రిచ‌యం అయింది హ‌న్సిక‌. ఆమెది ముంబ‌యి అయిన‌ప్ప‌టికీ న‌టిగా దాదాపు ద‌క్షిణాదిలోనే సెటిల్ అయింది. అతి త్వ‌ర‌లోనే ఈ న‌టి పెళ్లి పీట‌లెక్క‌నున్నారు. డిసెంబ‌ర్ లో తాను వివాహ బంధంలోకి అడుగుపెట్ట‌బోతున్న‌ట్టు ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌క‌టించారు.

హ‌న్సిక చెప్పిన వెంట‌నే నెటిజ‌న్లు హ‌న్సిక భ‌ర్త గురించి వెత‌క‌డం ప్రారంభించారు. ఇంత‌లోనే త‌న‌కు కాబోయే భ‌ర్త‌ను ఫ్యాన్స్ కి ప‌రిచ‌యం చేసింది హ‌న్సిక‌. ముంబై కి చెందిన వ్యాపారవేత్త సొహైల్ కతురియా ను ఆమె పెళ్లి చేసుకోనున్న‌ట్టు ఈఫిల్ ట‌వ‌ర్ వ‌ద్ద అత‌నితో క‌లిసి దిగిన ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. ‘ఎప్ప‌టికి ప్రేమిస్తూనే ఉంటా’ అని చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం హ‌న్సిక షేర్ చేసిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.  ఇందులో హ‌న్సిక‌కు కాబోయే భ‌ర్త ప్ర‌పోజ్‌చేయ‌గా.. అందుకు ఆమె అంగీకారం తెలుపుతూ హ‌గ్ చేసుకుంది.

ఈ ఫోటోల‌ను చూసిన నెటిజ‌న్లు కాబోయే జంట‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. రాజ‌స్థాన్ రాష్ట్రం జైపూర్‌లోని ఓ రాజ‌కోట‌లో డిసెంబ‌ర్ 04న కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో వీరి పెళ్లి ఘ‌నంగా జ‌రుగ‌నుంది.  అయితే డిసెంబ‌ర్ 2 నుంచి పెళ్లి ప‌నులు ప్రారంభం కానున్నాయి. ప్ర‌స్తుతం హ‌న్సిక న‌టించిన పార్ట్‌న‌ర్, 105 మిన‌ట్స్ చిత్రాల షూటింగ్స్ పూర్త‌వ్వ‌గా.. తెలుగులో మై నేమ్ ఈజ్ శృతి, త‌మిళంలో రెండు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌న్సిక పెళ్లికి సంబంధించిన వార్త తెగ వైర‌ల్ అవ్వ‌డం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు