Hansika : టాలీవుడ్ ముద్దుగుమ్మలలో ఒకరైన హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పెళ్లి అనంతరం కొంతకాలం పాటు ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రజెంట్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేందుకు కసరత్తులు చేస్తుంది.
ఈ క్రమంలోనే పలు సినిమాలు అండ్ వెబ్ సిరీస్లు ఒప్పుకుంటూ దూసుకుపోతుంది. అంతేకాకుండా తాజాగా ఢీ సెలబ్రిటీస్ సీజన్ 2 కి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తుంది ఈ బ్యూటీ. ఇక ఇదిలా ఉంటే ఒకపక్క సినిమాలు అండ్ వెబ్ సిరీస్ లతో దూసుకుపోతూనే మరో పక్క సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది హన్సిక. ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ తో ముచ్చటిస్తుంది.
ఇక తాజాగా వైట్ కలర్ సారీ ధరించి గోల్డెన్ కలర్ బ్లౌజ్ లో దర్శనమిచ్చింది. అచ్చ తెలుగు ఆడపిల్లలాగా మెరిసింది హన్సిక. బంగారంలా మెరిసిపోతున్న హన్సికని చూసి పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.