Hansika Motwani: సారీ కట్టి.. క్యూట్‌ అందాలు ఆరబోసిన హన్సిక

Hansika Motwani: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒకప్పటి స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చూడడానికి ఎంతో అందంగా, బబ్లీగా ఉంటుంది. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్, మాటలతో ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తుంది. ఇక ఈ బ్యూటీ అతి చిన్న వయసులోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో నటించింది. హన్సిక మహారాష్ట్ర రాజధాని ముంబైలోని సింది ప్రాంతానికి చెందిన ఓ కుటుంబంలో 1991లో జన్మించింది.

హన్సిక తండ్రి ప్రదీప్ మోత్వాని ఓ ప్రముఖ వ్యాపారవేత్త. తల్లి మోనా మోత్వాని డెర్మటాలజిస్ట్. ఇక హన్సిక పుట్టి పెరిగిందంతా ముంబైలోనే. తన చదువు కూడా ముంబైలోనే పూర్తి చేస్తుంది. ఆ తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో మొదటగా సీరియల్స్ లలో నటించింది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేసింది. ఇక ఏకంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేసినటువంటి దేశముదురు సినిమాలో హీరోయిన్గా అవకాశాన్ని కొట్టేసింది. ఇక ఈ సినిమాలో తన అద్భుతమైన నటనకు కాదు ఎన్నో అవార్డులు వచ్చాయి.

Hansika Motwani Gives Retro Vibes In A Polka Dot Saree SEE PICS
ఇక ఈ సినిమా అనంతరం ఈ బ్యూటీ వరుస సినిమా అవకాశాలను అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా నటించింది. స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక హన్సిక సోహెల్ అనే వ్యక్తిని 2022 డిసెంబర్ లో వివాహం చేసుకుంది. ఇక వివాహ అనంతరం హన్సిక మళ్ళీ సినిమాల్లో అవకాశాల కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది. వరుస ఫోటోషూట్లు, గ్లామర్ షోతో రచ్చ చేస్తుంది. ఇక లేటెస్ట్ గా ఈ బ్యూటీ వైట్ అండ్ ఎల్లో కలర్ శారీలో మెరిసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి తన అందాలని చూపిస్తూ కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. ఇక ఈ ఫోటోలో ఎంతో అందంగా, సాంప్రదాయంగా ముస్తాబయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు