Hanu Raghavapudi: ఈ పరిణామాలన్నీ చూస్తుంటే, ప్రభాస్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయిపోయినట్టే

Hanu Raghavapudi: అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు హను రాఘవపూడి. మొదటి సినిమాతోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన దర్శకుడు దొరికాడు అని అనిపించుకున్నాడు. ఆ సినిమా చూస్తున్నంత సేపు కూడా చాలామందికి లైబ్రరీలో కూర్చొని ఒక పుస్తకాన్ని. ముఖ్యంగా సినిమాలోని సంభాషణలు చాలామందిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అది ఒక మణిరత్నం కైండ్ ఆఫ్ సినిమా అని చాలామందికి అనిపించింది. వాస్తవానికి ఆ సినిమాలో మిధున అనే పాత్రను తెలుగు సినిమా మిస్సమ్మ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాశాడు హను. సినిమాకి ప్లస్ పాయింట్ రథన్ అందించిన మ్యూజిక్. ఇప్పటికీ సీతారామం తర్వాత అంతటి బెస్ట్ వర్క్ అందాల రాక్షసి సినిమాకు మాత్రమే హను చేశాడు అని అనిపిస్తూ ఉంటుంది.

ఇక ప్రస్తుతం హను ప్రభాస్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఒక పాకిస్తాన్ నటిని ఫిక్స్ చేసినట్లు సమాచారం వినిపిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ‘సీతా రామం’లో తన పాత్రతో పేరు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ కథానాయికగా ఈ సినిమాలో నటిస్తుందని మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మరో కథానాయికగా పాకిస్థానీ నటి సజల్ అలీని తీసుకోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు కూడా నిజమని అనుకోవచ్చు ఎందుకంటే ఇంస్టాగ్రామ్ లో హను సజల్ అలీని ఫాలో అవుతున్నాడు. అలానే సజల్ అలీ కూడా ప్రభాస్ ని ఫాలో అవుతుంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ప్రభాస్ ఈ సినిమాలో సజల్ అలీ హీరోయిన్ గా ఫిక్స్ అయిపోయినట్లే అని తెలుస్తుంది.

Sajal Ali

- Advertisement -

ఇకపోతే ఈ సినిమా హిస్టారికల్ ఫిక్షన్ నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని దర్శకుడు హను రాఘవపూడి వెల్లడించారు. ఈ కథ భారతదేశానికి స్వాతంత్ర్యానికి ముందు జరిగే యుద్ధ నేపథ్యంలో సాగే ప్రత్యేకమైన ప్రేమకథ అని చెప్పారు. ఈ సినిమాలో ప్రభాస్ బ్రిటీష్ సైనికుడిగా కనిపిస్తాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా గురించి అధికారికంగా మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు