Hanuman : సాధారణ యువకుడు మహాశక్తి శాలిగా మారి..

డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇటీవల జాంబి రెడ్డి సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన ఈసారి అదే తేజ సజ్జ హీరోగా హనుమాన్ సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. మొదటి భారతీయ సూపర్ హీరో చిత్రాన్ని తీస్తున్నట్లు ప్రకటించిన వర్మ, ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ను రిలీజ్ చేయగా, వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ఈ హనుమాన్ మూవీ టీజర్ సోమవారం విడుదలైంది. “గభీర సాగర గర్భంతరస్థ అధిలోక మహిమాన్విత మహాశక్తియుత హనుమ రుధీర మనీ నిరీక్షణం” అనే డైలాగుతో టీజర్ ఇంట్రెస్టింగ్ గా మొదలైంది. అతీంద్రియ శక్తులతో పోరాడే ఓ యువకుడిగా తేజ సజ్జ ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. హనుమాన్ అండతో సాధారణ యువకుడు మహాశక్తి శాలిగా మారి శత్రువుల్ని ఎలా ఎదుర్కొన్నాడో సినిమాలో చూపించబోతున్నట్లుగా టీజర్ చూస్తే తెలుస్తోంది.

తేజ సజ్జ పై తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ టీజర్ లో వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్ కుమార్ డిఫరెంట్ గెటప్ లలో కనిపించారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ టీజర్ లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరో ట్రీట్ ఇచ్చాడు. తాను కూడా ఒక సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. సూపర్ హీరోస్ లతో ఈ యూనివర్స్ ఉండబోతుంది. అందులో మొదటి సూపర్ హీరో గా హానుమాన్ గా తేజ సజ్జ కనిపించబోతున్నాడు.

- Advertisement -

కాగా ఇప్పటికే సినిమాటిక్ యూనివర్స్ లను లోకేష్ కనగరాజ్, సైలేష్ కొలాను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రశాంత్ వర్మ కూడా వీరి లిస్ట్ లో చేరిపోయాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు