Hanuman: కక్కుర్తి పడ్డ స్టార్ విలన్.. గోల్డెన్ ఛాన్స్ మిస్..!

Hanuman.. ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి, జాంబిరెడ్డి సినిమాతో హీరోగా మారి సత్తా చాటిన యంగ్ హీరో తేజ సజ్జ (Teja sajja) హీరోగా నటించిన చిత్రం హనుమాన్.. చిన్న సినిమాగా వచ్చి భారీ అంచనాలు క్రియేట్ చేసి స్టార్ హీరోల సినిమాలను కూడా ఓడించి అతి తక్కువ సమయంలోనే రూ.100కోట్ల మార్క్ దాటేసి రికార్డు సృష్టించింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత సీక్వెల్ ప్రకటించారు చిత్ర బృందం. ఎప్పుడెప్పుడు ఈ మూవీ మొదలవుతుందా అని అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ సినిమాలో హనుమాన్ పాత్రలో ఏ స్టార్ హీరో కనిపించబోతున్నారనే ఆసక్తి కూడా నెలకొంది.

Hanuman: Star Villain done a big mistake.. Golden Chance Missed..!
Hanuman: Star Villain done a big mistake.. Golden Chance Missed..!

డబ్బుకు ఆశపడి హనుమాన్ లో అవకాశాన్ని వదులుకున్న..

ఇదిలా ఉండగా తాజాగా హనుమాన్ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పంచుకున్నారు. తాజాగా నాచురల్ స్టార్ హీరో నాని నటిస్తున్న తాజా చిత్రం సరిపోదా శనివారం. ఈ సినిమా వచ్చేనెల ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా వచ్చిన ప్రశాంత్ వర్మ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. సరిపోదా శనివారం సినిమా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపిన తర్వాత… ఇందులో విలన్ పాత్రలో కనిపించనున్న ఎస్ జె సూర్య గురించి మాట్లాడుతూ.. ఎస్ జె సూర్య(S.J.Surya ) అద్భుతమైన దర్శకుడు అలాగే అద్భుతమైన నటుడు కూడా.. నేను తీసిన హనుమాన్ సినిమాలో ఒక పాత్ర కోసం ఎస్. జె. సూర్యను అనుకున్నాం. కానీ ఆయన రెమ్యూనరేషన్ దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాన్ని విరమించుకున్నారు .కానీ ఆ తర్వాత చిత్రాలలో ఆయనతో కలిసి పని చేయాలనుకుంటున్నాను అంటూ తెలిపారు ప్రశాంత్ వర్మ.

హనుమాన్ లో విలన్ గా వినయ్..

మొత్తానికి అయితే హనుమాన్ సినిమాలో ఏ పాత్రకు ఎస్. జె.సూర్య ని అనుకున్నారు అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. కానీ ఈ విషయం విని డబ్బు కోసం కక్కుర్తి పడి బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో విలన్ పాత్రలో వినయ్ అద్భుతంగా నటించారు.

- Advertisement -

నటుడి గానే కాదు దర్శకుడిగా కూడా ఎస్ జె సూర్య సక్సెస్..

దర్శకుడిగా ఎన్నో హిట్స్ అందుకొని తనదైన ముద్ర వేసుకున్న ఈయన, కొంతకాలంగా నటుడిగా ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయారు. ప్రస్తుతం తెలుగు, తమిళ్ భాషలలో అనేక చిత్రాలలో కీలకపాత్రలు పోషిస్తున్న ఈయన ఇటీవల రాయన్ సినిమాలో కూడా విలన్ గా నటించి, సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఎస్ జె సూర్య ఒకవైపు విలనిజం పండిస్తూనే.. ఆ విలనిజం లో కూడా కామెడీ చేయగల కెపాసిటీ ఉన్న వ్యక్తి. ఈయన నటనకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఏ పాత్రకైనా సరే జీవం రావాల్సిందే. ఏ పాత్రలోనైనా నటిస్తాడు కాబట్టే దర్శక నిర్మాతలు కూడా ఆయనతో సినిమా చేయడానికి ఇష్టపడతారు. మరి హనుమాన్ చిత్రం లో ఎలాగో అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. మరి ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఒక సినిమాలోనైనా నటిస్తాడేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు