Hanuman: అయోధ్య రామ మందిరానికి విరాళం ఇచ్చిన హనుమాన్ టీమ్..!!

Hanuman: నిన్నటి రోజున యంగ్ హీరో తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన చిత్రం హనుమాన్. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.. అయితే ఈ సినిమా విడుదలకు ముందు హనుమాన్ టీం ఈ సినిమా కలెక్షన్స్ లో కొంత మొత్తాన్ని అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే . అనుకున్నట్టుగానే చిత్ర బృందం తాజాగా విరాళం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన ఆదాయంలో 14.25 లక్షల రూపాయలను.. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు విరాళంగా అందించినట్లు తెలుస్తోంది.

అయితే అంతకుముందే చిత్ర బృందం మొత్తం ఫిలింనగర్ లో ఉండే హనుమాన్ ఆలయానికి వెళ్లి అక్కడ కొన్ని ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు.. జనవరి 12న విడుదలై హనుమాన్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతోంది.. సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్గా అమృత అయ్యర్ నటించింది.. అలాగే నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇందులో కీలకమైన పాత్రలో నటించారు.

విలన్ గా స్టైలిష్ స్టార్ వినయ్ రాయ్ కూడా మెప్పించారు.. సముద్రఖని , వెన్నెల కిషోర్ , గెటప్ శ్రీను, రోహిణి తదితరులు సైతం కనిపించారు. ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఉండడంతో విడుదలకు ఒక్కరోజు ముందే జనవరి 11వ తేదీన ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్ షోలు వేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర బృందం ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది.. తమ సినిమాకు అమ్ముడుపోయే ప్రతి టికెట్టులో కూడా ఐదు రూపాయలను అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇస్తామని ప్రకటించారు.

- Advertisement -

Hanuman team donated to Ayodhya Ram temple..!!

ఇక హనుమాన్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా చిరంజీవి కూడా రాగా.. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవినే ప్రకటించారు. అలా ఇచ్చిన మాట ప్రకారమే ప్రీమియం షోల ద్వారా వచ్చిన ఆదాయంలో రూ.14.25 లక్షల రూపాయలను విరాళంగా పంపించారు. అంతేకాకుండా హనుమాన్ సినిమా థియేటర్లో ఉన్నన్ని రోజులు కూడా అమ్ముడుపోయే ప్రతి టికెట్టు పైన ఐదు రూపాయలను అయోధ్య రామ మందిరానికి విరాళం గాని ప్రకటించారు చిత్ర బృందం. మరి సినిమా ముగిసే సమయానికి అయోధ్య రామ మందిరానికి ఎంత విరాళంగా ప్రకటిస్తారో చూడాలి. ఈ విషయం తెలిసి హనుమాన్ టీం ని ప్రజలు, ప్రేక్షకులు, సినీ ప్రముఖులు సైతం అభినందిస్తున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు