Happy Birthday Gautham: మళ్లీ రావా నుంచి విజయ్‌ సినిమా వరకు… కెరీర్ సాగింది ఇలా…

మళ్లీ రావా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు గౌతమ్ తిన్ననూరి. మొదటి సినిమాతోనే మంచి ఫిలిం మేకర్ గా తనకంటూ ఒక పేరును సంపాదించుకున్నాడు. దాదాపు సుమంత్ కెరియర్ అయిపోయింది అనుకునే టైంలో, సుమంత్ ను హీరోగా పెట్టి అద్భుతమైన హిట్టును సాధించుకున్నాడు. చైల్డ్ హుడ్ లవ్ స్టోరీ ని అందంగా అద్భుతంగా చూపించాడు గౌతమ్ తిన్ననూరి.

తన మొదటి సినిమాలోనే గౌతమ్ రైటింగ్ స్టైల్, గౌతమ్ టేకింగ్ ఇవన్నీ కూడా ఆడియన్స్ కి సర్ప్రైజింగ్ అనిపించాయి. వీటి అన్నిటిని మించి గౌతమ్ కి కున్న మ్యూజిక్ టేస్ట్ కూడా అద్భుతం అనిపించింది. ఈ సినిమాలో పాటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక లో బడ్జెట్లో ఒక సినిమాను ఇంత అందంగా తీయొచ్చు అని ప్రూవ్ చేసిన సినిమా మళ్లీ రావా. ఈ సినిమాతోనే ప్రముఖ నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా నిర్మాతగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

ఈ సినిమా తర్వాత గౌతమ్ చేసిన సినిమా జెర్సీ. జెర్సీ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నాని కెరియర్ లో ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అంటే జెర్సీ. అంత అద్భుతంగా ఆ సినిమాను తెరకెక్కించాడు గౌతమ్ తిన్ననూరి. జెర్సీ సినిమాకి అనిరుధ్ సంగీతం అందించాడు. అనిరుధ్ అందించిన సంగీతం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అప్పటికే అనిరుధ్ పైన ఉన్న అజ్ఞాతవాసి బ్యాడ్ మార్క్ అంతటినీ కూడా జెర్సీ సినిమా మాయం చేసింది.

- Advertisement -

దాదాపు 30 ఏళ్లకే కెరియర్ అంతా అయిపోయింది అనుకునే టైంలో 36 ఏళ్లు ఉన్న ఒక వ్యక్తి తన ఆశయం కోసం ఎంతలా కష్టపడి దాన్ని ఆచీవ్ చేశాడు అని చూపించడమే జెర్సీ సినిమా యొక్క కాన్సెప్ట్. పోరాడుతూ ఓడిపోయిన కూడా అది గెలవడమే అని అద్భుతమైన మెసేజ్ ను జెర్సీ సినిమా ద్వారా చూపించాడు గౌతమ్. ఈ సినిమా నేషనల్ అవార్డు ని కూడా అందుకుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైర్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించారు.

ఈ సినిమా తర్వాత ఏకంగా రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశం దక్కింది గౌతం తిన్ననూరికి. అయితే ఈ సినిమాని యూవి క్రియేషన్స్ అనౌన్స్ కూడా చేసింది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈ సినిమా ఆగిపోయింది.

ఇప్పుడు రామ్ చరణ్ తో గౌతమ్ సినిమా ఆగిపోయిన కూడా ఇంకోసారి మరో కథతో వీరి ప్రయాణం మొదలవుతుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే గౌతమ్ కి ఉన్న టాలెంట్ అలాంటిది. చరణ్ తో ఆగిపోయిన సినిమాను ఇప్పుడు విజయ్ దేవరకొండతో చేస్తున్నాడు గౌతమ్. ఇలానే మంచి సినిమాలు చేసి కెరియర్లో ముందుకెళ్లి అద్భుతమైన విజయాలు సాధించాలని కోరుకుంటూ గౌతమ్ కి ఫిల్మిఫై తరఫునుంచి హ్యాపీ బర్త్డే.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు