Happy Birthday Kajal: సత్యభామలు అంటే అవ్వదు, పంచదార బొమ్మ అంటే లిటిల్ బిట్ మ్యానేజ్ చేస్తాం

Happy Birthday Kajal:లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కాజల్. అయితే మొదటి సినిమా తోనే బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా కాజల్ కి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా అంటే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేసిన మగధీర సినిమాని చెప్పాలి. ఈ సినిమా తర్వాత కాజల్ కి వరుస అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేసిన ఆర్య 2 సినిమాలో కూడా కనిపించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని నమోదు చేసుకుంది.

స్టార్ హీరోల సరసన

హీరోయిన్ గా చాలామంది స్టార్ హీరోల సరసన నటించింది. అల్లు అర్జున్ తో ఆర్య 2, పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్, మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం, ఎన్టీఆర్ తో బృందావనం ఇలా చాలా సినిమాలు చేసింది కాజల్. అయితే ప్రతి హీరోయిన్ కి కూడా ఒక సొంత లైఫ్ అంటూ ఉంటుంది. అలా తన వ్యక్తిగత జీవితం మీద ఫోకస్ చేసి గౌతమ్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది కాజల్. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది రీసెంట్ గా బిడ్డకు కూడా జన్మనిచ్చింది.

Happy Birthday Kajal

- Advertisement -

కాజల్ రీఎంట్రీ

ప్రస్తుతం ఒకప్పుడు హీరోయిన్ గా చలామణి అయిన వాళ్లంతా కూడా ఇప్పుడు ఫిమేల్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్న సినిమాలు చేయడంలో ఆసక్తి చూపుతున్నారు. ఇక లేడి ఓరియంటెడ్ సినిమాలను తమ కెరియర్లో ప్లాన్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా సమంత కూడా వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తుంది. ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చిన కాజల్ కూడా సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకి సరైన ఆదరణ లభించలేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా వచ్చినట్లే వెళ్ళిపోయింది. దీనిని మించి ఈ సినిమా పైన టోల్స్ కూడా మొదలయ్యాయి. ఈ సినిమా రిలీజ్ కంటే ముందు కొంతమంది సత్యభామలు అంటే అవ్వదు, పంచదార బొమ్మ అంటే లిటిల్ బిట్ మ్యానేజ్ చేస్తాం. అంటూ కామెంట్స్ కూడా పెట్టారు. కాజల్ కెరీర్ లో వచ్చిన మగధీర సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమాలో పంచదార బొమ్మ అనే పాట కూడా మంచి హిట్ అయింది. అయితే ఆ సినిమాలో కూడా అంతే అందంగా ఉంటుంది కాజల్. అలాంటి క్యూట్ పర్ఫామెన్స్ చూస్తాం కానీ ఇలాంటి లేడీ పవర్ ఫుల్ క్యారెక్టర్స్ అంతగా ఎక్కువగా అనేది ఈ కామెంట్స్ వెనక ఉద్దేశం.ఏదేమైనా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సాధించుకున్న కాజల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు