Happy Birthday Nandamuri Kalyan Ram: కళ్యాణ్ రామ్ పరిచయం చేసిన దర్శకులు

Happy Birthday Nandamuri Kalyan Ram: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో కళ్యాణ్ రామ్ ఒకరు. నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు కళ్యాణ్ రామ్. అయితే చాలామంది నటులు కొత్త దర్శకులను పరిచయం చేస్తారు. కొంతమంది హీరోలు కూడా కొత్త దర్శకులతో పనిచేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలానే కళ్యాణ్ రామ్ కూడా కొత్త దర్శకుల్ని చాలామందిని పరిచయం చేశాడు. వారిలో ఇప్పుడు ముగ్గురు దర్శకులు మాత్రం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉన్నారు అని చెప్పొచ్చు.

Athanokkade

కళ్యాణ్ రామ్ పరిచయం చేసిన దర్శకుల్లో సురేందర్ రెడ్డి ఒకరు. అతనొక్కడే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సురేందర్ రెడ్డి. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతనొక్కడే సినిమా తర్వాత కిక్, రేసుగుర్రం, ఊసరవల్లి వంటి హిట్ సినిమాలు తెరకెక్కించాడు సురేందర్ రెడ్డి. మెగాస్టార్ చిరంజీవితో కూడా సైరా నరసింహారెడ్డి అని ప్యాన్ ఇండియా సినిమాను తెరకెక్కించాడు.

- Advertisement -

Bimbisara

ఇక ప్రస్తుతం సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు అనిల్ రావిపూడి. ఇక రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ తో కూడా తాను చేయబోయే సినిమాను అనౌన్స్ చేశాడు అనిల్. ఇక పటాస్ అనే సినిమాతో అనిల్ రావిపూడి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు. కళ్యాణ్ రామ్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించి అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటివరకు అనిల్ కెరియర్లో డిజాస్టర్ అయిన సినిమా ఒకటి కూడా రాలేదు. అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి.

Anil Ravipudi

ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమాకి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. బింబిసార సినిమాతో వశిష్ట తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఇక ఈ దర్శకుడిని కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కళ్యాణ్ రామ్ కి దక్కుతుంది. ఒక దర్శకుడు టాలెంట్ ని మొదటిసారి నమ్మి అవకాశం కల్పించడం అనేది మామూలు విషయం కాదు. ఇలా ముగ్గురు టాప్ దర్శకులను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కళ్యాణ్ రామ్ అందించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు